ఏపీ నిరుద్యోగులకు సదవకాశం | advantage of ap unemployment people | Sakshi
Sakshi News home page

ఏపీ నిరుద్యోగులకు సదవకాశం

Published Thu, Mar 9 2017 3:08 PM | Last Updated on Sat, Jun 2 2018 3:08 PM

ఏపీలోని నిరుద్యోగ యువతకు ఉపాధి చూపించే దిశగా ఏపీ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్చేంజ్ డాట్ కామ్ ఏర్పాటైంది.

ఇంటర్నెట్ డెస్క్: మండుటెండల్లో ఉద్యోగం కోసం వెతికి వేసారిన వారికి ఇది నిజంగా చల్లటి కబురే. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో నివసించే నిరుద్యోగ యువతకు ఉపాధి చూపించే దిశగా ఏపీ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్చేంజ్ డాట్ కామ్ ఏర్పాటైంది. రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న స్థానిక ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ఇదో చక్కటి వేదిక. ఈ సైట్‌లో రిజిస్టర్‌ చేసుకుని రెజ్యూమె/సీవీ అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది. అభ్యర్థి అర్హతలకు తగిన ఉద్యోగాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుకోవచ్చు. అభ్యర్థుల సెల్‌ఫోన్‌, ఈమెయిల్‌కు మెసేజ్‌ల రూపంలో ఉద్యోగ సమాచారం అందుతుంది.

ఆయా జిల్లాల వారీగా, మండలాల వారీగా ఉద్యోగాల వివరాలను తెలుసుకోవచ్చు. ప్రైవేట్‌ ఉద్యోగాలతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం, నోటిఫికేషన్లు కూడా ఈ సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో రిజిస్ట్రేషన్‌ కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగార్థులు అన్ని సేవలను ఉచితంగానే పొందవచ్చు. రిక్రూటర్లు సైతం ఈ సైట్‌లో జాబ్‌ పోస్టింగ్‌ చేయడం ద్వారా తగిన నైపుణ్యాలు, అర్హతలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://www.apemploymentexchange.com/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement