నిరుద్యోగం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో ఏర్పడ్డ అసహనం, అసంతృప్తి వల్లే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్, భారత్‌లో మోదీ అధికారంలోకి వచ్చా రని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.
ప్రిన్స్‌టన్: నిరుద్యోగం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో ఏర్పడ్డ అసహనం, అసంతృప్తి వల్లే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్, భారత్‌లో మోదీ అధికారంలోకి వచ్చా రని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. నిరుద్యోగం అనేది ఒక ప్రధాన సమస్యగా ఎక్కువ మంది గుర్తించకపోవడం మరో కారణమన్నారు. ఉద్యోగాల కల్పనలో తమ పార్టీ విఫలమవ్వడం వల్లే 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైందన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ బుధవారం ప్రిన్స్‌టన్ వర్సిటీ విద్యా ర్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ‘ట్రంప్ సంగతేమో కానీ, మా ప్రధాని మాత్రం ఉద్యోగాల కల్పనకు సరైన ప్రయత్నం చేయడం లేదు’ అని చెప్పారు.