హుజూర్‌నగర్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఇచ్చిన తర్వాతే సీఎం కేసీఆర్ ఓట్లు అడగాలని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2018 డిసెంబర్ నుంచి నిరుద్యోగులకు ప్రభుత్వం నెలకు రూ.3 వేల చొప్పున బాకీ ఉన్నదని చెప్పారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీలో చెప్పి ఇంతవరకు పట్టించుకోకుండా కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు
గత ఎన్నికల్లో దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక అందరినీ మోసం చేశారన్నారు. రాష్ట్రంలో అతి పెద్ద సామాజికవర్గంగా ఉన్న మాదిగలకు మంత్రి పదవి ఇవ్వలేదని, మరో పెద్ద సామాజికవర్గం ముదిరాజ్‌లకు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, ముస్లింలకు మూడు సీట్లు ఇచ్చినా వాటిలో రెండు ఓడిపోయే సీట్లేనని అన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ రెండు కలిసిపోయాయని, ఢిల్లీలోని బీజేపీని ఇంటికి పంపాలంటే బీఆర్‌ఎస్‌ను ఓడించాలన్నారు.
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను ఓడించాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 70 పైచిలుకు స్థానాలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 12 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్, కోదాడలలో 50 వేల ఓట్ల మెజారీ్టతో గెలవబోతున్నామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment