
ముంబై: కరోనా వైరస్ ఉదృతి వల్ల 14కోట్ల70లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని సిడ్నికి చెందిన 'ప్లోస్ వన్' అనే రీసెర్చ్ సంస్థ నివేదిక తెలిపింది. అదేవిధంగా కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయంగా 3.8ట్రిలియన్ల ఉత్పత్తిని కంపెనీ యాజమాన్యాలు నష్టపోయారని నివేదిక పేర్కొంది. అయితే తమ సర్వేలో తయారీ రంగం, పర్యాటక రంగం, రవాణా రంగాలు తీవ్రంగా నష్టపోయినట్లు సిడ్నీ యూనివర్సిటీకి చెందిన అరుణిమా మాలికా తెలిపారు. మరోవైపు ఉత్పత్తికి అంతరాయం కలగడం వల్ల 2.1ట్రిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఉద్యోగులు నష్టపోయినట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదిక పేర్కొంది.
అయితే కరోనా కారణంగా ప్రజలు రవాణాకు దూరంగా ఉండడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గినట్లు నివేదిక తెలిపింది. కరోనాను నివారించేందుకు ప్రభుత్వాలు పరష్కార మార్గాలను ఆలోచించాలని సర్వే ప్రతినిధులు పేర్కొన్నారు.కాగా కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ను విధించడం వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొందని ఆర్థిక నిపుణులు విశ్లేషించారు.
Comments
Please login to add a commentAdd a comment