చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించకుండా అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తుందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ. 2 వేలు నిరుద్యోగ బృతి ఇస్తామని చెప్పి.. ఆ హామీని కూడా తుంగలో తొక్కారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 31 నెలలైనందున.. నెలకు రూ. 2 వేల చొప్పున ప్రతి నిరుద్యోగికి రూ. 62 వేలు బకాయి పడ్డారని భూమన పేర్కొన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు మొత్తం రూ. లక్షా 8 వేల కోట్లను ప్రభుత్వం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.