![Woman Molestation By Govt Teacher For Ask Her Chit Fund Money - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/14/money.jpg.webp?itok=_y9scBTk)
సాక్షి, మెదక్ మున్సిపాలిటీ: చిట్టీల వ్యాపారం నిర్వహించే ఓ ప్రభుత్వ ఉపాధ్యా యుడు తనకు ఇవ్వాల్సిన చిట్టీ డబ్బులు అడుగుతుంటే కోరిక తీరిస్తేనే ఆ సొమ్ములు ఇస్తానని వేధిస్తున్నాడంటూ ఓ యువతి ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఉత్తరాలు రాసింది. మెదక్ పట్టణంలో కలకలం రేపిన ఈ లేఖల వ్యవహారంపై పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం. ‘తండ్రి మద్యానికి బానిసగా మారి బాగోగులు పట్టించుకోకపోవడంతో నా పెళ్లికోసమని జీతంలో నుంచి కొంత పొదుపు చేసి ప్రభుత్వ ఉపాధ్యాయుడి దగ్గర రూ.2 లక్షలకు చిట్టీ వేశాను.
26 నెలల చిట్టీ గడువు తీరి చాలా కాలమైంది. ఇటీవల పెళ్లి కుదరడంతో డబ్బులు అడిగితే మీ నాన్న కు ఇచ్చేశానని బుకాయిస్తున్నాడు. ఈ మధ్యన ఒంటరిగా కలిసినప్పుడు ఎలాగూ వచ్చేనెల పెళ్లి కాబట్టి, ఓ నాలుగు రోజులు నా దగ్గర గడుపు.. అలా అయితేనే నీ డబ్బులు నీకిస్తా’ అని వేధిస్తున్నాడు.. లేదంటే నీ క్యారెక్టర్ మంచిది కాదని పెళ్లి కొడుకు వాళ్లతో చెబుతాను.. మీ నాన్నకు ఓ పది వేలిస్తే అతను కూడా అదే చెప్తాడు.. అప్పుడు పరువుపోతుంది.. పైసలు పోతాయి.., పెళ్లి క్యాన్సిల్ అవుతుంది’ అంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని సదరు యువతి ఆ లేఖల్లో పేర్కొంది. కాగా ఈ వ్యవహారంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ మధు తెలిపారు.
(చదవండి: నాడు నాన్న.. నేడు అమ్మ అనాథైన బాలిక)
Comments
Please login to add a commentAdd a comment