
సాక్షి, హైదరాబాద్ : చిన్నాచితక అధికారినంటే మోసం చేయలేననుకున్నాడో..ఏమో ఏకంగా ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీనంటూ మోసాలకు తెగబడ్డాడో ఓ నేరగాడు. ఏకంగా ఉన్నతాధికారులనే బెదిరించాడు. పాపం పండటంతో చివరకు కటకటాలపాలయ్యాడు. ఇది ఘరానా మోసగాడు విజయ్‌కుమార్ బాగోతం. డిజిటల్ సీపీ టెక్నాలజీ లిమిటెడ్ పేరుతో విజయ్‌కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఖానామెట్‌లో వివాదాస్పదంగా ఉన్న రెండెకరాల భూమి డాక్యుమెంట్‌ను విడుదల చేయాలని రంగారెడ్డి సబ్ రిజిస్టార్ సబ్బారావును విజయ్‌కుమార్ బెదిరించాడు. ఇందుకోసం సీఎం ఆఫీసులో పనిచేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింగరావు పేరును వాడుకున్నాడు.
తాను ప్రిన్సిపల్ సెక్రటరీనంటూ సబ్‌రిజిస్ట్రార్‌ను బెదిరించాడు. వేధింపులు ఎక్కువకావటంతో సబ్‌రిజిస్టార్ పోలీసులను ఆశ్రయించారు. తీగలాగితే విజయ్‌కుమార్ బండారం బయటపడింది. ఇదొక్క కేసే కాదు.. విజయ్‌కుమార్‌పై తెలంగాణ, ఏపీ, చెన్నైలో తప్పుడు డాక్యుమెంట్లు, బెదిరింపుల చేశాడంటూ 15 కేసులు నమోదయ్యాయి. పట్టుబడిన తర్వాత పోలీసుల విచారణలోనూ విజయ్‌కుమార్ మాజీ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ కొడుకునని చెప్పుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment