నీ వెనకాల ఉండే ఆ అక్కల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్‌లో కూర్చోవాల్సిందే
సబిత, సునీత తదితరులను ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు
ద్రవ్య వినిమయ బిల్లుపై కేటీఆర్ ప్రసంగానికి బదులిచి్చన సీఎం
రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సభ్యుల అభ్యంతరం.. సభలో గందరగోళం
అరుపుల మధ్యే సీఎం ప్రసంగం
సబితను అక్కలా భావించా.. ఆమెను విశ్వసించి కాంగ్రెస్‌లో చేరా
అండగా ఉంటానని.. టీఆర్‌ఎస్‌లో చేరి మోసం చేశారన్న సీఎం
బీఆర్‌ఎస్ వాళ్లు కలిసి వస్తామంటే నమ్మేదెవరంటూ ప్రశ్న
రేవంత్ వ్యాఖ్యలపై సబిత ఆవేదన
నాపై ఎందుకీ కక్ష.. ఎందుకు టార్గెట్ చేశారు? అంటూ నిలదీత
సాక్షి, హైదరాబాద్: ‘మేము కలిసి వస్తాం. ప్రభుత్వానికి సహకరిస్తాం అని కేటీఆర్ పదే పదే చెప్తున్నారు. మీరు కలిసి వస్తారా?! అన్నం ఉడికిందా లేదా? అన్నది ఒక్క మెతుకు పట్టి చూస్తే తెలుస్తుంది. ప్రతిపక్ష నాయకుడు (కేసీఆర్) సభకే రారు. వీరు కలిసి వస్తా అంటే నమ్మేది ఎవరు? నేను అందుకే వారికి (కేటీఆర్) సూచన చేస్తున్నా. నీ వెనకాల ఉండే అక్కలు ఇక్కడ (కాంగ్రెస్‌లో) ఉండి చెప్పి చెప్పి, ఇక్కడ ముంచి అక్కడ (బీఆర్‌ఎస్)తేలిండ్రు.. ఆ అక్కల మాటలు విన్నడు అనుకో, జూబ్లీ బస్టాండ్‌లో కూర్చోవాల్సి వస్తది..’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
శాసనసభలో బుధవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్ సభ్యుడు కేటీఆర్ మాట్లా డారు. ఆయన ప్రసంగం ముగించగానే ఆయన వెనకాల ఉన్న బీఆర్‌ఎస్ సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు గట్టిగా బల్లలు చరుస్తూ మద్దతు పలికారు. ఈ నేపథ్యంలోనే సీఎం మాట్లాడుతూ.. ‘వెనకాల ఉండే అక్కలు..’ అనే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి అరుపులు, నినాదాలు, కాంగ్రెస్ సభ్యుల ప్రతి నినాదాలతో గందరగోళం మధ్యే రేవంత్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
అండగా నిలబడతానని చెప్పి మోసం చేశారు: రేవంత్
‘ప్రజాజీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత, ప్రజాజీవితానికి సంబంధించిన చర్చ ఉంటుంది. నాకు, సబితక్కకి మధ్య జరిగిన వ్యక్తిగత చర్చను ఆమె సభలో చెప్పారు. కాబట్టి దానికి కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలను నేను సభలోనే చెప్పాల్సిన అసవరముంది. కాంగ్రెస్ పారీ్టలోకి నన్ను సబిత ఆహ్వానించడం, పెద్ద లీడర్ అవుతావని చెప్పడం వాస్తవమే. నేను ఆమె మాటను విశ్వసించి, సొంత అక్కగా భావించి, కుటుంబ సంబంధాలు, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆనాడు కాంగ్రెస్‌లో చేరా. 2019లో కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయమంది.
అప్పుడు సబితక్క నన్ను పిలిచి మల్కాజిగిరి నుంచి పోటీ చెయ్యి.. ఎన్నికల్లో అండగా నిలబడతానని మాట ఇచ్చారు. కానీ నన్ను పార్టీ ఎంపీ అభ్యరి్థగా ప్రకటించిన మరుక్షణమే ఆమె టీఆర్‌ఎస్‌లో చేరారు. కేసీఆర్ మాయమాటలను నమ్మి అధికారం కోసం కాంగ్రెస్‌ను వదిలి టీఆర్‌ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముడిని మోసం చేశారు. (ఇది నిజమా? కాదా? అని సబితారెడ్డినుద్దేశించి ప్రశ్నించారు) కాబట్టే ఆమెను నమ్మవద్దని కేటీఆర్‌కు సూచించా. బీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవులు పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెబితే మేము ఏమైనా అమాయకులమా?..’ అంటూ సీఎం ప్రశ్నించారు. ‘మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వలేదని కేటీఆర్ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు.
2014–19 మధ్యకాలంలో ఒక్క మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపించారు. ప్రభుత్వానికి సహకరించేది ఉంటే ప్రతిపక్ష నాయకుడిని సభలో కూర్చోమని చెప్పండి..’ అని రేవంత్ అన్నారు. తాను కొత్త గవర్నర్‌కు ఆహా్వనం పలకడానికి విమానాశ్రయానికి వెళ్తున్నానని, తిరిగి వచి్చన తర్వాత అందరికీ సమాధానమిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి సభ నుంచి వెళుతుండగా బీఆర్‌ఎస్ సభ్యులు ‘షేమ్ ..షేమ్’ అంటూ నినాదాలు చేశారు. దీనికి ముందు బీఆర్‌ఎస్ సభ్యుల నిరసనల నేపథ్యంలో స్పీకర్ అవకాశం ఇవ్వడంతో సబిత గద్గద స్వరంతో మాట్లాడారు.
ఏం మోసం చేశాం: సబితా ఇంద్రారెడ్డి
‘రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పారీ్టలో చేరినప్పుడు నేను అక్కగా ఆశీర్వదించా. నువ్వు చాలా ఎదుగుతావు.. ఈ రాష్ట్రానికి సీఎం అవుతావు..అంటూ పారీ్టలోకి ఆహా్వనించా. సీఎం గుండెల మీద చెయ్యి వేసుకుని ఇది నిజమా? కాదా? చెప్పాలి. ఈ రోజు నాపై ఎందుకు కక్ష తీర్చుకుంటున్నాడో అర్థం కావడం లేదు. ప్రతిసారీ అసెంబ్లీలో ఒక ఆడబిడ్డకు బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండ్రు. నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు.. మోసం చేస్తరని అన్నడు? ఏం మోసం చేశాం? ఏం ముంచినం? వీళ్లను ముంచినమా? ఎన్నికల సమయంలో కూడా నా నియోజకవర్గంలో మాట్లాడుతూ సబితక్క పొద్దునొక్క మాట, రాత్రి ఒక్క మాట మాట్లాడతది అన్నాడు.
పొద్దునొక్క మాట, రాత్రి ఒక్క మాట ఏం మాట్లాడిన? ఎవరిని, ఎందుకు అవమానిస్తున్నవు? ఎందుకీ కక్ష ? ప్రతిసారీ టార్గెట్ చేస్తున్నరు. ఏం చేసినం మేము ఆడబిడ్డలం. సీఎం తన మాటలను ఉపసంహరించుకోవాలి..’ అని సబిత డిమాండ్ చేశారు. సబిత ఆ మాట అనగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. అంతకు ముందు ‘సీఎం రేవంత్ ఏ పార్టీలో నుంచి వచ్చారు? కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి నా ఇంటిపై వాలినా కాలి్చవేస్తా అని గతంలో అన్నారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ నుంచి అంత మందిని ఎందుకు చేర్చుకున్నారు..’ అని సబిత నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment