కడపలోని తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలో నివసిస్తున్న శీలం సునీత (22) అనే వివాహిత భర్త చంద్రపాల్ వేధింపులు తాళలేక శనివారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో విషపు గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడింది.
కడప అర్బన్ : కడపలోని తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలో నివసిస్తున్న శీలం సునీత (22) అనే వివాహిత భర్త చంద్రపాల్ వేధింపులు తాళలేక శనివారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో విషపు గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడింది. కొంత కాలంగా వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో మానసిక ఆవేదనకు గురైన సునీత ఈ చర్యకు పాల్పడింది. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా ఎస్‌ఐ రాజరాజేశ్వరరెడ్డి తెలిపారు.