
Bunny Vasu And Sunitha Boya: సినీ ప్రొడ్యుసర్ బన్నీవాసు తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసారంటూ జిల్లాకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ వాదిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బన్నీవాసు తనను మోసగించిన వైనంపై సోమవారం పోలీసు స్పందన కార్యక్రమంలో అనంతపురం ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్పను కలిసి ఆమె ఫిర్యాదు చేసి, న్యాయం చేయాలని కోరారు.
దీనిపై ఎస్పీ ఆదేశాల మేరకు సునీత, ఆమె తల్లి పార్వతమ్మను దిశ పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు విచారణ చేశారు. అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. ఫిర్యాదుకు సంబంధించి ఆమె ఆధారాలను అందిస్తే విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.