
సునీత
రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా టిఆర్ఎస్ జడ్పిటిసి సభ్యురాలు సునీత మహేంద్ర రెడ్డి ఎన్నికయ్యారు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా టిఆర్ఎస్ జడ్పిటిసి సభ్యురాలు మంత్రి పట్నం మహేంద్ర రెడ్డి భార్య సునీత ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఆమె రెండవ సారి ఎన్నికయ్యారు. వైఎస్ చైర్మన్గా టిడిపి కుత్బుల్లాపూర్ జడ్పిటిసి సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపికైన వెంటనే సునీత చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేశారు.
తగిన బలం లేకపోయినా జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలలో టిఆర్ఎస్ అనూహ్యంగా విజయం సాధించింది. తగిన వ్యూహంతో ముందుకువెళ్లి జిల్లా పరిషత్ను గెలుచుకుంది. కాంగ్రెస్‌లో లుకలుకలు ఆ పార్టీకి బాగా ఉపయోగపడ్డాయి. టీడీపీతో రాయబేరాలు సాగించి సరిపడా సంఖ్యాబలాన్ని సమీకరించడంలో సఫలీకృతమైంది.