
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): ఓ సినీ నిర్మాత తనకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ సినీ నటి సునీత బోయ నిరసనకు దిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు గురువారం రాత్రి సునీత బోయ నగ్నంగా బైఠాయించి తనకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను అనంతపురం జిల్లాలోని తన స్వగ్రామానికి పంపించారు.
వివరాలివీ... తెలుగులో పలు సూపర్‌హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి, డిస్ట్రిబ్యూటర్‌గా పేరొందిన బన్నీ వాసు తనను మోసం చేశారని... వాడుకొని వదిలేశాడని ఆమె ఆరోపించింది. బన్నీవాసు తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ అక్కడ బైఠాయించడంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులతో తనను బన్నీవాసు బెదిరిస్తున్నాడని మానసికంగా వేధించడమే కాకుండా చంపడానికి ప్రయత్నిస్తున్నాడంటూ దుయ్యబట్టింది. రెండు గంటల పాటు ఆమె గీతాఆర్ట్స్ కార్యాలయం ముందు హడావుడి చేశారు.
చదవండి: (కాంగ్రెస్‌కు క్యాన్సర్ సోకింది.. మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment