వివేకా హత్యకేసు గురించి మాట్లాడొద్దన్న మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేతకు నో
ఆ ఉత్తర్వుల ఎత్తివేత కోసం వేసిన పిటిషన్లు కొట్టివేత
ఒక్కొక్కరికి రూ.10 వేల ఖర్చులు విధించిన న్యాయస్థానం
మధ్యంతర ఉత్తర్వులను షర్మిల బేఖాతరు చేశారన్న వైఎస్సార్‌సీపీ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం
వివేకా హత్య గురించి మాట్లాడొద్దని పునరుద్ఘాటన
ప్రధాన వ్యాజ్యంలో విచారణ జూన్ 19కి వాయిదా
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: అడ్డగోలు ఆరోపణలు, దుష్ప్రచారంతో మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును రాజకీయ లబి్ధకోసం వాడుకుంటున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, టీడీపీ పులివెందుల అభ్యర్థి బీటెక్ రవిలకు కడప జిల్లా కోర్టు మరోసారి గట్టి షాక్ ఇచ్చింది.
వివేకా హత్యకేసు సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఆ కేసు గురించి మాట్లాడొద్దని, దుష్ప్రచారం చేయవద్దని చంద్రబాబునాయుడు, లోకేశ్, షర్మిల, సునీత, బీటెక్ రవి, పవన్‌కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు ఆ పార్టీల కేడర్‌ను ఆదేశిస్తూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసేందుకు కోర్టు నిరాకరించింది.
మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ షర్మిల, సునీత, బీటెక్ రవి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న వివేకా హత్యకేసు గురించి మాట్లాడటానికి వీల్లేదని పునరుద్ఘాటించింది. షర్మిల, సునీత, బీటెక్ రవిలకు ఒక్కొక్కరికి రూ.10 వేలు ఖర్చుల కింద విధించింది. ఆ మొత్తాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని వారిని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా జడ్జి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. విచారణను జూన్ 19కి వాయిదా వేశారు.
తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారంపై వైఎస్సార్‌సీపీ న్యాయపోరాటం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రోద్బలంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై షర్మిల, పురందేశ్వరి, పవన్‌కళ్యాణ్, లోకేశ్, వివేకా కుమార్తె సునీతారెడ్డి తదితరులు చేస్తున్న దు్రష్పచారంపై వైఎస్సార్‌సీపీ కడప జిల్లా కోర్టులో దావా వేసింది. తమ పార్టీతోపాటు పార్టీ అధ్యక్షులు జగన్, కడప ఎంపీ అభ్యర్థితోపాటు పార్టీకి చెందిన వారిపై పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేయకుండా షర్మిల, చంద్రబాబు, సునీతారెడ్డిలను నిరోధించాలంటూ వైఎస్సార్‌సీపీ కడప జిల్లా అధ్యక్షుడు కె.సురే‹Ùబాబు ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారించిన జిల్లా కోర్టు.. వైఎస్ వివేకా హత్యకేసు విచారణ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నందున వైఎస్ అవినాశ్‌రెడ్డిని హంతకుడిగా ఆరోపిస్తూ చేస్తున్న దు్రష్పచారాన్ని ఆపాలని చంద్రబాబు, షర్మిల, సునీత, పవన్‌కళ్యాణ్, పురందేశ్వరి, బీటెక్ రవి తదితరులను ఆదేశిస్తూ గతనెలలో తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
అవినాశ్‌రెడ్డిని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రక్షిస్తున్నారంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ఆపాలని తేలి్చచెప్పింది. జగన్‌మోహన్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశించింది.
కడప కోర్టులోనే తేల్చుకోవాలన్న హైకోర్టు ధర్మాసనం
జిల్లా కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాలంటూ షర్మిల, సునీత, బీటెక్ రవి హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ కడప జిల్లా కోర్టులో వేర్వేరుగా అనుబంధ పిటిషన్లు వేశారు. షర్మిల తదితరుల వ్యాజ్యాలపై విచారించిన హైకోరుŠట్ ధర్మాసనం కడప కోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేత కోసం కడప కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.
షర్మిల తదితరుల అనుబంధ వ్యాజ్యాలపై కడప జిల్లా కోర్టు మూడు రోజులుగా విచారిస్తోంది. వైఎస్సార్‌సీపీ తరఫున పిటిషన్ వేయడంపై షర్మిల తదితరుల న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. తమ వ్యాఖ్యల వల్ల నష్టం వాటిల్లిందని భావిస్తే జగన్‌మోహన్‌రెడ్డి లేదా అవినాశ్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేయాలే తప్ప పార్టీ జిల్లా అధ్యక్షుడు కాదని చెప్పారు. ఈ వాదనలను వైఎస్సార్‌సీపీ న్యాయవాదులు ఎం.నాగిరెడ్డి, కె.సుదర్శన్‌రెడ్డి తోసిపుచ్చారు.
తాము ఇచ్చిన ఆధారాలతో సంతృప్తి చెందినందునే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిందని చెప్పారు. చంద్రబాబు, షర్మిల, సునీత తదితరుల తప్పుడు ఆరోపణలు ప్రజల్లోకి వెళితే ఓట్లపరంగా వైఎస్సార్‌సీపీకి నష్టం కలుగుతుందని, అందుకే పార్టీ తరఫున పిటిషన్ వేశామని తెలిపారు. వివేకా హత్యకేసు గురించి మాట్లాడవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తరువాత కూడా షర్మిల తదితరులు ఆ కేసు గురించి మాట్లాడారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
ఇరుపక్షాల వాదనలు ముగియడంతో బుధవారం జిల్లా జడ్జి కోర్టు హాల్లోనే ఉత్తర్వులను వెలువరించారు. నాగిరెడ్డి, సుదర్శన్‌రెడ్డి వాదనలతో జడ్జి ఏకీభవించారు. మధ్యంతర ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ షర్మిల ఆ కేసు గురించి మాట్లాడారన్న వారి వాదనను పరిగణనలోకి తీసుకున్నారు. మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేతకు నిరాకరిస్తూ.. షర్మిల, సునీత, బీటెక్ రవి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టేశారు.
Comments
Please login to add a commentAdd a comment