భార్య తనతో రావడానికి నిరాకరించిందని.. మరదలితో కలిసి.. | Bihar: After Wife Refuses To Return Home Man Elopes With sister In Law | Sakshi
Sakshi News home page

భార్య తనతో రావడానికి నిరాకరించిందని.. మరదలితో కలిసి..

Apr 28 2022 9:12 PM | Updated on Apr 28 2022 10:05 PM

Bihar: After Wife Refuses To Return Home Man Elopes With sister In Law - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పాట్నా: భార్య తనతో రావడానికి నిరాకరించిందని ఓ వ్యక్తి తన మరదలితో కలిసి పారిపోయాడు. ఈ విచిత్ర ఘటన బిహార్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఛప్రా జిల్లాకు చెందిన కృష్ణ రామ్ అనే వ్యక్తికి 12 సంవత్సరాల కిత్రం సంకటి దేవితో వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లు సవ్యంగా సాగిన వీరి కాపురంలో తరువాత గొడవలు తలెత్తాయి. దీంతో సకంటి దేవి తన తల్లిగారి ఇంటికి వెళ్లి నివసిస్తోంది.

ఈ క్రమంలో తన భార్యను పుట్టింటి నుంచి తీసుకొచ్చేందుకు రామ్‌ అత్తవారింటికి వెళ్లాడు. అయితే భర్తతో పాటు వెళ్లడానికి ఆమె నిరాకరించంది. దీంతో కోపోద్రిక్తుడైన కృష్ణ రామ్‌.. మైనర్‌ అయిన తన మరదలికి మాయమాటలు చెప్పి ఆమెను తీసుకొని పారిపోయాడు. దీంతో మైనర్‌ తండ్రి తన కూతురిని కిడ్నాప్‌ చేశారంటూ రామ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరి ఆచూకీ వెతికి పట్టుకున్నారు. అయితే అప్పటికే మైనర్‌ తనకు బాల్యం వివాహం చేస్తున్నారని సొంత కుటుంబానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఇంతలో పోలీసులు ఇద్దరి ఆచూకి కనుగొన్నారు. మైనర్‌ని కిడ్నాప్ చేసినందుకు రామ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, బలవంతంగా పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్న తల్లిదండ్రుల నుంచి తప్పించుకునేందుకే రామ్‌తో కలిసి పారిపోతున్నట్లు మైనర్ పోలీసులకు చెప్పింది. ఈ కేసుపై పూర్తి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
చదవండి👉 బంజారాహిల్స్‌: వివాహితతో రెండేళ్లుగా సహజీవనం..దూరం పెడుతోందని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement