Bihar Woman Forcibly Married Lover After Caught Viral - Sakshi
Sakshi News home page

వీడియో: వివాహితతో అడ్డంగా దొరికితే.. చితకొట్టి పెళ్లి చేసిన భర్త, అత్త!

Published Sat, Jul 8 2023 8:38 PM | Last Updated on Sat, Jul 8 2023 8:53 PM

Bihar woman forcibly married lover after Caught Viral - Sakshi

పాట్నా: వివాహేతర సంబంధం ఆమె జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. నలుగురిలో పరువు పోయేలా చేయడంతో పాటు కన్నబిడ్డలకూ దూరం చేసేసింది. ప్రియుడితో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఆమెకు బలవంతంగా మళ్లీ పెళ్లి చేశారు ఆమె భర్త, అత్తలు. 

బీహార్‌​ నవాడా జిల్లాలో ఈ ఘటన జరిగింది. కొంతకాలంగా స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఆమె.. భర్తలేని టైంలో ఇంటికే రప్పించుకుంటోంది. అయితే పక్కింటి వాళ్లు ఇచ్చిన సమాచారంతో నిఘా వేసిన భర్త, అతని తల్లి వాళ్లిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ ప్రియుడిని దొరకబుచ్చుకుని చితకబాదేశారు. అయితే.. 

ఆ తర్వాతే అసలు కథ నడిచింది. ఈ ఊరి సెంటర్‌లో ఉన్న గుడి వద్దకు ఆమెను, ఆ ప్రియుడిని తీసుకెళ్లారు. అతని చేత ఆమె నుదుటిపై సింధూరం అద్దించారు. గ్రామస్తులంతా చూస్తుండగా.. ఆమె రోదిస్తుండగానే వాళ్లిద్దరికీ వివాహం చేశారు. ఆపై పిల్లలిద్దరినీ తీసుకుని ఆ భర్త, అత్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చివరకు ఆ ప్రియుడు, ఆ వివాహిత అక్కడ మిగిలిపోయారు. స్థానికులెవరూ అది అడ్డుకోకపోగా.. తమ ఫోన్లకు పని చెప్పారు. 

ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని పోలీసులు చెబుతున్నారు. కొసమెరుపు ఏంటంటే.. ఆ వ్యక్తికీ వివాహమై ముగ్గురు పిల్లలున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండగా.. ఇదెక్కడ న్యాయమంటూ ప్రశ్నిస్తున్న వాళ్లూ కనిపిస్తున్నారు మరి!.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement