పెళ్లి కూతురి బదులుగా.. చెంప పగలకొట్టిన మరదలు | Bride Sister Slaps Bride Groom Bihari Video Viral | Sakshi
Sakshi News home page

ఫన్నీ వీడియో: తప్పతాగి పెళ్లి కూతురి బదులు.. చెంప పగలకొట్టి రచ్చ చేసిన మరదలు

Jun 24 2022 1:41 PM | Updated on Jun 24 2022 2:57 PM

Bride Sister Slaps Bride Groom Bihari Video Viral - Sakshi

బావ చెంప పగలకొట్టిన మరదలు.. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లో ఇప్పుడు ఈ వీడియో తెగ..

వైరల్‌: సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే ఫొటోలు, వీడియోలు ఎంతో ప్రత్యేకమైనవి. వాటి వైరల్‌ హడావిడి మామూలుగా ఉండదు. అందునా.. వధువు, వరుడితో ముడిపిన ప్రత్యేకత ఏదైనా ఉంటే మాత్రం ఆదరించేస్తుంటారు నెటిజన్స్‌.  తాజాగా పెళ్లిలో స్టేజ్‌పైనే బావ చెంప పగలకొట్టిన మరదలు అంటూ.. ఓ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. 

తప్పతాగిన వరుడు.. తూలుతూనే స్నేహితుడి సాయంతో స్టేజ్‌పై నిల్చుని ఉన్నాడు. అతనికి ఎదురుగా పెళ్లి కూతురు  ఉంటుంది. ఇద్దరూ దండలు మార్చుకోవాల్సిన టైంలో.. వధువు వంతు పూర్తి అవుతుంది. ఈలోపు వధువు చెల్లి హరతి, అక్షింతల పళ్లెంతో స్టేజ్‌ మీద ప్రత్యక్షమవుతుంది. అయితే తాగిన మైకంలో వధువుకి బదులుగా......  కింద వీడియో చూసేయండి..

ఈ వీడియో ఇది కొత్తదా? పాతదా?.. ఏదైనా షార్ట్‌ ఫిల్మ్‌లో భాగమా? అసలు ఎక్కడ జరిగింది? కావాలనే తీశారా? నిజంగా జరిగిందా? అనే విషయాలపై ఎక్కడా క్లారిటీ లేదు. కేవలం వాళ్ల సంభాషణల ఆధారంగా అది బీహారీ వీడియో అని స్పష్టం అవుతోంది. వధువు చెల్లి బాదుతుంటే.. అడ్డుకునే ప్రయత్నాలు పెద్దగా కనిపించవు. పైగా తాగుబోతు తూలే నటన కూడా అంత బాగాలేదన్న కామెంట్లు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా.. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ రీల్స్‌లో మాత్రం తెగ వైరల్‌ అవుతూ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అందుకే ఈ వీడియోను మీకు అందిస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement