bride groom drunk
-
పెళ్లి కూతురి బదులుగా.. చెంప పగలకొట్టిన మరదలు
వైరల్: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు ఎంతో ప్రత్యేకమైనవి. వాటి వైరల్ హడావిడి మామూలుగా ఉండదు. అందునా.. వధువు, వరుడితో ముడిపిన ప్రత్యేకత ఏదైనా ఉంటే మాత్రం ఆదరించేస్తుంటారు నెటిజన్స్. తాజాగా పెళ్లిలో స్టేజ్‌పైనే బావ చెంప పగలకొట్టిన మరదలు అంటూ.. ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. తప్పతాగిన వరుడు.. తూలుతూనే స్నేహితుడి సాయంతో స్టేజ్‌పై నిల్చుని ఉన్నాడు. అతనికి ఎదురుగా పెళ్లి కూతురు ఉంటుంది. ఇద్దరూ దండలు మార్చుకోవాల్సిన టైంలో.. వధువు వంతు పూర్తి అవుతుంది. ఈలోపు వధువు చెల్లి హరతి, అక్షింతల పళ్లెంతో స్టేజ్ మీద ప్రత్యక్షమవుతుంది. అయితే తాగిన మైకంలో వధువుకి బదులుగా...... కింద వీడియో చూసేయండి.. बिहार में शराबबंदी बा ... 🤔😅🤣😂🥃 pic.twitter.com/MiWYfF2N2T — Vikki1975 (@Vikki19751) June 21, 2022 ఈ వీడియో ఇది కొత్తదా? పాతదా?.. ఏదైనా షార్ట్ ఫిల్మ్‌లో భాగమా? అసలు ఎక్కడ జరిగింది? కావాలనే తీశారా? నిజంగా జరిగిందా? అనే విషయాలపై ఎక్కడా క్లారిటీ లేదు. కేవలం వాళ్ల సంభాషణల ఆధారంగా అది బీహారీ వీడియో అని స్పష్టం అవుతోంది. వధువు చెల్లి బాదుతుంటే.. అడ్డుకునే ప్రయత్నాలు పెద్దగా కనిపించవు. పైగా తాగుబోతు తూలే నటన కూడా అంత బాగాలేదన్న కామెంట్లు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా.. ట్విటర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్‌లో మాత్రం తెగ వైరల్ అవుతూ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అందుకే ఈ వీడియోను మీకు అందిస్తున్నాం. -
పెళ్లి ఆపింది.. బహుమతి పొందింది
భువనేశ్వర్ : పెళ్లి కూతురు అలంకరణలో మమత భోయ్ మెరిసిపోతుంది. మరి కొద్ది క్షణాల్లో తాను నూతన జీవితంలోకి ప్రవేశించబోతున్నాననే ఆలోచనతో ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. పచ్చని పందిరి మమత నూరేళ్ల జీవితానికి సాక్ష్యమన్నట్లు నిలిచింది. నిండు నూరేళ్లు చల్లగా బతకమని ఆశీర్వదించడానికి తన బంధువులంతా తరలి వచ్చారు. మరి కాసేపట్లో మాంగళ్యధారణ జరుగనుంది. ఈ లోపు వరుడు మంటపానికి వచ్చాడు.. సారి తీసుకొచ్చారు. అతడిని చూస్తే.. పెళ్లి కొడుకు అనే అభిప్రాయం అక్కడున్న ఎవరికి కలగడం లేదు. వరుడు సమీపిస్తోన్న కొద్ది మందు వాసన గుప్పుమంటోంది. మత్తులో తూగుతూ.. స్థిరంగా నిలబడేందుకు కూడా లేక పోవడంతో నలుగురు వ్యక్తులు కలిసి అతడిని మంటపానికి తీసుకొచ్చారు. బంధువులతో పాటు మమత కూడా అతని వాలకానికి ఆశ్చర్యపోయింది. ఇలాంటి వ్యక్తితోనా తాను జీవించబోయేది అనుకుంది. వెంటనే ఓ నిర్ణయానికొచ్చింది. తాను ఈ పెళ్లి చేసుకోబోవడం లేదంటూ మంటపం నుంచి వచ్చేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె నిర్ణయాన్ని ఆమోదించారు. విషయం కాస్తా జిల్లా అధికారులకు తెలిసింది. వారు మమత చూపిన తెగువను మెచ్చుకుంటూ రూ. 10 వేల నగదు బహుమతిని అందజేశారు. మమత ధైర్యం ఎందరో ఆడపిల్లలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ విషయం గురించి మమత మాట్లాడుతూ.. ‘మత్తులో జోగుతున్న పెళ్లి కొడుకును చూడగానే ఇతనితో కలిసి జీవితాంతం ఎలా బతకాలి అనిపించింది. ఆ క్షణమే అతడిని పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదని నాకు తెలుసు. నా కుటుంబ సభ్యులు, బంధువులు కూడా నాకు మద్దతుగా నిలిచారు. అందుకు వారికి ధన్యవాదాలు’ అన్నారు మమత. ఆమె చూపిన చొరవను ప్రశంసిస్తూ.. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నాడు ప్రభుత్వం మమతా భోయ్‌ను ప్రశంసించింది. -
మండపంలోనే వరుడిని ఛీకొట్టింది!
పాట్నా: మరికొన్ని క్షణాల్లో పెళ్లితంతు ముగుస్తుందని భావించిన అందరికీ వధువు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తాగుబోతు వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని, తాను ఈ వివాహం చేసుకోనని తేల్చి చెప్పడంతో కార్యక్రమం రద్దయింది. ఈ ఆశ్చర్యకర ఘటన బిహార్ లోని బక్సార్ జిల్లా సుజాత్పూర్లో గత శనివారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. బిట్టు పాండే(24)కు రాణి కుమారిని ఇచ్చి వివాహం చేయాలని పెద్దలు భావించారు. శుక్రవారం రాత్రి వరకూ అన్ని పనులు పూర్తిచేశారు. శనివారం ఉదయం పెళ్లితంతు దాదాపు పూర్తయింది. వధువు మెడలో మూడు ముళ్లు పడతాయనగా వరుడిని ఛీకొట్టింది. బిట్టును పెళ్లిచేసుకోనని, అతడు మద్యం సేవించి ఉన్నాడని.. అందుకే సరిగ్గా నిలబడలేకపోతున్నాడంటూ రాణి తన బంధువులకు వివరించింది. ఆమె పెద్దలు ఇందుకు సమ్మతించారు. జీలకర్ర పెట్టిన తర్వాత పెళ్లి ఆగిపోవడంతో పెళ్లికి వచ్చిన బంధువులు, సన్నిహితులు షాకయ్యారు. పెళ్లిరద్దుపై వధువు రాణి కుమారి బంధువు జై నిశ్వాస్ స్పందించారు. 'బిహార్ లో గత ఏప్రిల్ 5 నుంచి పూర్తి మద్యనిషేధం అములులో ఉంది. ఎవరైనా మద్యం సేవించినట్లు అధికారులు గుర్తిస్తే దాదాపు పదేళ్లపాటు జైలుశిక్ష పడుతుందని వధువు ఇలా చేసింది. ముందుగానే వరుడి గురించి తెలిసినందుకు బంధువులు అందరూ సంతోషంగా ఉన్నారు' అని చెప్పుకొచ్చాడు. గత వారం తూర్పపట్నాలో వరుడు బైక్ డిమాండ్ చేయడంతో వధువు పెళ్లిని ఆపేసిన విషయం తెలిసిందే.