westgodavari disctict
-
ఇంజనీరింగ్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పొతవరం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి హత్య కేసును పోలీసులు చేధించారు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన సత్యనారయణ వంశీ ను హత్య చేశాడాని పోలీసులు తెలిపారు. 2019 లో డేటింగ్ యాప్ ధ్వారా వంశీ కి సత్యనారాయణ పరిచయం అయ్యాడు. తరువాత ఇద్దరు మధ్య స్వలింగ సంపర్కం జరిగాక డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ ఘతుకానికి పాల్పడ్డాడు. చింతలసత్యనారాయణ, కొనకళ్ల వంశీ రాత్రి 7 గంటల సమయంలో పోతవరం షుగర్ ఫ్యాక్టరీ దగ్గర కలిశారని..వంశీ రూ.5 వేలు ఇవ్వక పోవడంతో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం మృతిని తండ్రిని సత్యనారాయణ లక్ష రూపాయలు డిమాండ్ చేసి 40 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. వంశీ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగాడబ్బులు తీసుకునే క్రమంలో సత్యనారాయణ ను అరెస్ట్ చేశామాని డీఎస్పీ పి.శ్రీనాధ్ తెలిపారు. -
కరోనా: వచ్చే నెల 4 వరకు పెనుగొండ సీల్
సాక్షి, పెనుగొండ: కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో పెనుగొండను వచ్చేనెల 4వ తేదీ వరకు సీల్ చేయాలని అధికారులు నిర్ణయించారు. గురువారం ఆర్డీఓ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. కరోనా రెండో దశకు చేరడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే విపరీత పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావించారు. ఇందుకు అనుగుణంగా పెనుగొండ పరిసర ప్రాంతాలను మూడు జోన్లుగా విభజించారు. కరోనా సోకిన ప్రాంతం నుంచి 820 మీటర్ల రేడియస్‌ను డేంజర్ జోన్‌గా, మూడు కిలోమీటర్ల రేడియస్‌ను రెడ్ జోన్‌గా, 5 కిలోమీటర్ల రేడియస్‌ను ఆరంజ్ బఫర్ జోన్లుగా విభజించారు. డేంజర్ జోన్లో ఎటువంటి కదలికలు ఉండకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలను వలంటీర్ల ద్వారా ఆ ప్రాంతంలో ఇళ్లకే అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. రెడ్ జోన్, ఆరంజ్ బఫర్ జోన్లలో నిత్యం ఆరోగ్య సర్వే చేయించాలని ఆదేశించారు. డేంజర్ జోన్లో ఉన్న సుమారు 200 మంది శ్యాంపిల్స్ సేకరించి కరోనా పరీక్షలకు పంపించారు. ఆయా రిపోర్టులు వచ్చినా వచ్చేనెల 4 వరకు ఆ ప్రాంతంలో ప్రజలంతా స్వీయ నిర్బంధంలోనే ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో పెనుగొండ మొత్తం హైఅలర్ట్ ప్రకటించారు. -
భూవివాదం: గిరిజన రైతు మృతి
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం సూరప్పవారంగూడెలో ఓ భూవివాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం సాయంత్రం తన పొలంలో దుక్కి దున్నుకుంటున్న గిరిజన రైతు దాది గోవింద్‌పై గిరిజనేతర రైతులు దాడి చేశారు. దీంతో వారి దాడిలో గిరిజనరైతు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో గాయపడ్డ రైతును గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా ఆతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాది గోవింద్ హత్యకు నిరసనగా సీపీఐ ఎం.ఎల్ న్యూ డెమోక్రసి ఆధ్వర్యంలో బుట్టాయిగూడెంలో రాస్తారోకో నిర్వహించారు. హత్యకు బాధ్యులైన గిరిజనేతర రైతులను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. -
నెరవేరిన వైద్య‘కల’శాల..
సాక్షి, ఏలూరు: జిల్లా కేంద్రం ఏలూరులోని కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ వైద్య కళాశాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని కృషితో జిల్లాకే తలమానికంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలకు మార్గం సుగమమైంది. ఏలూరు పర్యటనలో భాగంగా స్థానిక సీఆర్ఆర్ డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో ఉదయం 10.25 గంటలకు దిగిన సీఎం వైఎస్ జగన్ అక్కడ నుంచి నేరుగా జిల్లా ప్రభుత్వాసుపత్రికి ఉదయం 10.40 గంటలకు చేరుకున్నారు. వైద్య కళాశాల భవనాల నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రి ట్రామాకేర్ సెంటర్లో పనిచేస్తోన్న సిబ్బంది, పారిశుధ్య కార్మికుల సమస్యలను సావధానంగా విన్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. అనంతరం 10.55 గంటలకు సీఎం ప్రభుత్వాసుపత్రి నుంచి స్థానిక ఇండోర్‌స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బయలుదేరివెళ్లారు. వైద్య కళాశాల నిర్మాణం ఇలా.. జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో 100 మంది విద్యార్థులకు తొలి ఏడాది ప్రవేశాలు కల్పిస్తూ ప్రతిపాదించిన వైద్య కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.266కోట్లు నిధులు ఇప్పటికే మంజూరు చేసింది. ఆసుపత్రిలోని 12.22 ఎకరాల్లో కళాశాల భవనాల నిర్మాణాలు చేపడతారు. మెడికల్ కౌన్సిల్ ప్రమాణాలకు అనుగుణంగా 5 లెక్చర్ హాల్స్, పరిపాలనా విబాగం, సెంట్రల్ లైబ్రరీ, సెంట్రల్ వర్క్‌షాప్, 13 వైద్య విభాగాల బ్లాక్‌లతోపాటు, బాలురు, బాలికలకు హాస్టల్, స్టాఫ్ క్వార్టర్లు, కిచెన్, కాంటీన్ తదితర సదుపాయాలు ఇందులో చేపడతారు. ఈ నిర్మాణాలను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, జిల్లా ఇన్చార్జి మంత్రి, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్, జిల్లా మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గాని భరత్, రఘురామకృష్ణంరాజు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, కలెక్టర్ ముత్యాలరాజు, డీసీహెచ్ఎస్ డాక్టర్ శంకరరావు, మెడికల్ కౌన్సిల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ వరప్రసాద్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ట్రామాకేర్ సిబ్బందికి న్యాయం చేస్తా ఏలూరు ప్రభుత్వాసుపత్రి ట్రామాకేర్ యూనిట్లో పనిచేస్తోన్న సిబ్బంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ బాధలు చెప్పుకున్నారు. సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ ప్రతి నెలా వేతనాలు సక్రమంగా చెల్లించేలా చర్యలు తీసుకుంటానని, ట్రామాకేర్ సిబ్బంది క్రమబద్ధీకరణకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. దీనిపై ట్రామాకేర్ సిబ్బంది ఎం.రమేష్, బి.రవి, కిశోర్, సుధారాణి తదితరులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి పారిశుధ్య కార్మికులకు వరాల జల్లు ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి పారిశుధ్య కార్మికులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. గత 20 సంవత్సరాలుగా ఔట్సోర్సింగ్ విధానంలో చాలీచాలని వేతనాలతో పనులు చేస్తున్నామని, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయన తమకు రూ.11,500 ఇవ్వాలంటూ జీవో ఇచ్చినా వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం తమను ఎవరూ పట్టించుకోలేదని గోడు చెప్పుకున్నారు. దీనిపై స్పందించిన సీఎం వైఎస్ జగన్ మున్సిపల్ కార్మికులతో సమానంగా ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తోన్న పారిశుధ్య కార్మికులకు రూ.18 వేలు వేతనాలు పెంచుతానని హామీ ఇచ్చారు. ఇక ఔట్ సోర్సింగ్ విధానంపై పరిశీలించి అందరికీ న్యాయం చేస్తానంటూ సీఎం వైఎస్ జగన్ వారికి హామీ ఇచ్చారు. వెంటనే స్పందించారు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాసుపత్రిలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్నాం. ఔట్సోర్సింగ్ విధానం కావటంతో చాలీచాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నాం. గత చంద్రబాబు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మా గోడు చెప్పుకోగానే ఆయన వెంటనే మాకు జీతాలు పెంచుతానని భరోసా ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ విధానం కూడా తీసేస్తానని చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌కు మా జీవితాంతం రుణపడిఉంటాం. – లక్ష్మణమూర్తి, ఎస్కే కరీమా, పారిశుధ్య కార్మికులు, ఏలూరు -
సిమెంటు మంట!
సాక్షి, తణుకు (పశ్చిమ గోదావరి): కేవలం నెల రోజుల వ్యవధిలోనే సిమెంటు ధర చుక్కలనంటింది. పెరిగిన ధరలు భవన నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధర కారణంగా నిర్మాణదారులు బెంబేలెత్తిపోతున్నారు. సామాన్యుడి సొంత ఇంటి కలపై పిడుగు పడినట్లైంది. ఇప్పటికే పనులు ప్రారంభించిన వారు నిర్మాణ వ్యయం అంచనాలను దాటిపోతుండటంతో అప్పులు చేస్తున్నారు. కొందరు బిల్డర్లు అయితే వడ్డీ భారం పెరుగుతుందనే కారణంతో అప్పు చేసి మరీ నిర్మాణ పనులను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే సిమెంటు ధర మాత్రం రూ.330 నుంచి రూ.370 వరకు పలుకుతోంది. ధర పెరగుతుండటంతో భవనాలతోపాటు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది. చుక్కలనంటుతున్న ధర సాధారణంగా భవన నిర్మాణ పనులకు జనవరి నుంచి జూన్ వరకు సీజన్‌గా చెబుతారు. ఈ వ్యవధిలోనే ఎక్కువగా నిర్మాణాలు జరుగుతుంటాయి. అయితే ఈ సీజన్లో మాత్రం కొంత వరకు ధరలు పెరుగుతుంటాయి. అయితే ఈ సారి మాత్రం పెరిగిన ధరలు నిర్మాణదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. భవన నిర్మాణంలో కీలకమైన సిమెంటు ధర భారీగా పెరిగింది. నెల రోజుల క్రితం వరకు బస్తా సిమెంటు ధర రూ. 330 వరకు ఉండగా ప్రస్తుతం ఆయా కంపెనీలను బట్టి రూ. 330 నుంచి రూ. 370 వరకు ధర పలుకుతోంది. దాదాపు రూ. 100కు పైగా ధర పెరగడం సామాన్యవర్గాలకు మింగుడు పడటంలేదు. ఇక ఇనుము సైతం రెండు నెలల వ్యవధిలోనే టన్నుకు రూ. 6 వేలు వరకు ధర పెరిగింది. ఇసుక ధర సైతం అదే బాట పట్టడంతో భవన నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. నిలిచిన ఇళ్ల నిర్మాణం ఇప్పుడు ఎవరైనా ఇంటి నిర్మాణం మొదలు పెడితే కళ్లు తిరగడం ఖాయం. కొద్ది నెలలుగా పెరుగుతున్న గృహనిర్మాణ సామగ్రి ధరలు సామాన్యులు, మధ్యతరగతి ప్రజలనే కాకుండా కాస్త ఉన్న వాళ్లను సైతం కలవరానికి గురి చేస్తున్నాయి. గతేడాదికి, ఇప్పటికి దాదాపు ఐరన్, సిమెంటు, ఇసుక ధరలు భారీ మొత్తంలో పెరిగాయి. పెరిగిన ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తలపెట్టిన నిర్మాణాలను అర్థాంతరంగా నిలిపివేస్తున్నారు. జిల్లాలో ఏడాదికి సుమారు 20 వేల వరకు పక్కా ఇళ్ల నిర్మాణం జరుగుతోందని బిల్డర్లు పేర్కొంటున్నారు. గృహనిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో దాదాపు 10 వేలకు పైగా పక్కా గృహ నిర్మాణాలు నిలిచిపోయాయి. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో కునారిల్లుతున్నాయి. ధరలు తగ్గే అవకాశం లేకపోవడంతో మొదలు పెట్టిన ఇళ్లు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు లేవు. మరోవైపు జిల్లాలోని సుమారు 100కుపైగా అపార్టుమెంట్లు సగంలోనే నిలిచాయి. ఇదిలా ఉంటే కూలీల రేట్లు సైతం అమాతం పెంచేశారు. రోజుకు రూ.600 పలుకుతుండటంతో భారం మరింత పెరుగుతోంది. సాధారణంగా వేసవిలోనే నిర్మాణాలు ఎక్కువగా జరుగుతాయి. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఐరన్, ఇసుక, సిమెంటు ధరలు పెంచడం సహజం. అయితే ఈ సారి గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ధరలు పెరిగాయని నిర్మాణదారులు గగ్గోలు పెడుతున్నారు. కష్టతరంగా మారింది పెరుగుతున్న గృహనిర్మాణ సామగ్రి ధరలు గుబులు పుట్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సిమెంటు ధర పెరిగింది. పెరిగిన ధరలతో నిర్మాణాలు నిలిపివేస్తున్నాం. ఇదే సమయంలో కూలీల కొరత వేధిస్తోంది. కూలీ ధరలు సైతం విపరీతంగా పెంచేయడంతో ఇబ్బందులు పడుతున్నాం. –పి.రవిశంకర్, బిల్డర్, తణుకు -
ఘోర రోడ్డు ప్రమాదం..!
సాక్షి, పశ్చిమగోదావరి : పెద్ద తాడేపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు.. హైవే పక్కన ఉన్న రైలింగ్‌ను ఢీకొట్టింది. ఇనుపరేకులు మెడలోకి చొచ్చుకుపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వారపరెడ్డి శ్రీనివాస్ అతని భార్య అన్నపూర్ణ(50), మనవడు ఆరుష్(1) ని తీసుకుని కృష్ణా జిల్లా గుంటుమిల్లికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవింగ్ చేస్తున్న శ్రీనివాస్‌కు స్వల్ప గాయాలు కాగా, అతని భార్య , మనవడు మృతి చెందారు. నిద్రమత్తులో వాహనాన్ని నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అదే ఆసుపత్రిలో గాయపడిన శ్రీనివాస్‌కు చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
భర్త నచ్చలేదు.. కట్నం వెనక్కి తీసుకోండి
సాక్షి, తాడేపల్లిగూడెం: సెల్ఫీ తీసుకుని ఓ గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగింది. పట్టణంలోని కొండయ్య చెరువు వద్ద గల తిరుమల అపార్టుమెంట్స్‌లో ఉంటున్న మౌనిక(24) అనే మూడు నెలల గర్భిణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఉరి వేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నది. ఆగస్టులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ నరేంద్రతో వివాహం అయింది. అమ్మానాన్న నన్ను క్షమించండి.. భర్త నచ్చలేదు.. కట్నం వెనక్కి తీసుకోండి అని ఆ వీడియోలో తల్లిదండ్రులను కోరింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తండ్రిని కొట్టి తల్లీకూతుళ్లపై అత్యాచారం..
* వారిద్దరితోపాటు కుటుంబ యజమానిపైనా హత్యాయత్నం * కోమాలోకి బాలిక తల్లిదండ్రులు కామాంధుడి ఘాతుకం * పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ సంఘటన ద్వారకాతిరుమల : అభం శుభం తెలియని చిన్నారిపైన, ఆమె తల్లిపైన అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ మృగాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఈ ఉన్మాది వారిని, అడ్డువచ్చిన బాలిక తండ్రిని హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఇంటి వెనుక ఉన్న గడ్డివాముకు నిప్పుపెట్టి అందులో బాలికను పడవేసి సజీవ దహనం చేసేందుకు యత్నించాడు.ఇది చూసిన ఆ బాలిక చెల్లెలు అక్కడి నుంచి ప్రాణభయంతో పారిపోయింది. ఈ ఘటన మండలంలోని పంగిడిగూడెం పంచాయతీ హనుమాన్లగూడెంలో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమాన్లగూడెంలోని ఒక పొలంలో శక్కాబత్తుల రాంబాబు భార్య సుమలత, ఇద్దరు కుమార్తెలతో కలసి నివసిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బంధువుల ఇంటికి వచ్చిన దెందులూరు మండలం గంగన్నగూడెం గ్రామానికి చెందిన వడ్లమూడి బాలకృష్ణ రైతు రాంబాబుతో స్నేహంగా ఉంటూ వ్యవసాయ పనుల్లో సహకరిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం తోటలోని సొరకాయలను కోసి భీమడోలు మార్కెట్లో విక్రయించేందుకు మోపెడ్‌పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో ఇద్దరూ మద్యం సేవించారు. అనంతరం బాలకృష్ణను వారి బంధువుల ఇంటి వద్దకు చేర్చిన రాంబాబు తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. రాత్రి రాంబాబు ఇంటికి వచ్చిన బాలకృష్ణ.. ఇంటి వెనుక గొర్రెలకు మేత వేస్తున్న రాంబాబుపై వెనుక నుంచి ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. ఈ గొడవకు బయటకు వచ్చిన అతని భార్యను ఒక రాయితో కొట్టాడు. రాంబాబు దాడితో భార్యాభర్తలిరువురూ స్పృహ కోల్పోగా సుమలతపై అత్యాచారం చేశాడు. అప్పటికి నిద్రలేచిన 13 ఏళ్ల వయస్సుగల రాంబాబు కుమార్తెను బెదిరించి అత్యాచారం చేశాడు. ఆ బాలిక కాళ్లు, చేతులు కట్టివేసి గడ్డివాముకు నిప్పుపెట్టి అందులో పడవేశాడు. అనంతరం ఇంటిలోకి ప్రవేశించి గ్యాస్‌ను వదిలి నిప్పంటించి ఇంటిని సైతం దగ్ధం చేశాడు. నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఇదంతా చూసిన 11 ఏళ్ల ఆ బాలిక చెల్లెలు అక్కడి నుంచి పారిపోయి దగ్గర్లో ఉన్న గడ్డివాములో దాక్కొంది. గురువారం మంటలను ఆర్పే సమయంలో ఆమెను గుర్తించిన బంధువులు తమ ఇంటికి తీసుకెళ్లారు. స్పృహ కోల్పోయిన రాంబాబు దంపతులను స్థానికులు 108లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారు ప్రస్తుతం ప్రాణపాయ స్థితిలో ఉన్నారు. 30 శాతం కాలిన గాయాలతో బాలిక ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఏలూరు డీఎస్సీ కేజీవీ సరిత గురువారం ఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితుడు వాడిన ఇనుపరాడ్డును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలిని పరిశీలించింది. డీఎస్పీ సరిత మాట్లాడుతూ.. నిందితుడిని గుర్తించామని, తాగుడుకు బానిసై ఉన్మాదిగా మారిన ఇతనిపై తల్లితండ్రులు సైతం గతంలో దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, త్వరలో నిందితుడిని పట్టుకుంటామన్నారు. ఆమె వెంట దెందులూరు ఎస్సై సుభాష్ తదితరులున్నారు.