
సాక్షి, తాడేపల్లిగూడెం: సెల్ఫీ తీసుకుని ఓ గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగింది. పట్టణంలోని కొండయ్య చెరువు వద్ద గల తిరుమల అపార్టుమెంట్స్‌లో ఉంటున్న మౌనిక(24) అనే మూడు నెలల గర్భిణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఉరి వేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నది. ఆగస్టులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నరేంద్రతో వివాహం అయింది. అమ్మానాన్న నన్ను క్షమించండి.. భర్త నచ్చలేదు.. కట్నం వెనక్కి తీసుకోండి అని ఆ వీడియోలో తల్లిదండ్రులను కోరింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment