Mumbai Crime News In Telugu: 16 Year Old Girl Injected With Aphrodisiacs And Eight Years Assaulted - Sakshi
Sakshi News home page

ఇంజెక‌్షన్లతో కామవాంఛ.. 8 ఏళ్లుగా యువతిపై

Published Tue, Jun 8 2021 6:04 PM | Last Updated on Wed, Jun 9 2021 3:30 PM

16 Year Old Girl Injected With Aphrodisiacs And Eight Years Assaulted - Sakshi

ముంబై: కామవాంఛతో కొందరు వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు. యువతికి కోరికలు రేకెత్తేలా ఇంజెక‌్షన్లు.. మందుబిల్లలు ఇస్తూ 8 సంవత్సరాలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు పోలీసులకు చిక్కారు. వీరిలో ఇద్దరు భార్యాభర్తలు కూడా ఉన్నారు. భర్తకు భార్యనే ప్రోత్సహించడం గమనార్హం. మైనర్‌గా ఉన్నప్పుడు కిడ్నాప్‌ చేయగా ఇప్పుడు ఆ బాలిక యువతిగా మారింది. ఎట్టకేలకు నిందితుల చెర నుంచి ఆ యువతి బయటపడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి కుమార్తె ఇంటర్‌ చదువుతుండేది. 16 ఏళ్లు ఉన్న ఆ బాలికను ఎనిమిదేళ్ల కిందట కొందరు కిడ్నాప్‌ చేశారు. అప్పటి నుంచి ఆమెపై అత్యాచారం చేస్తున్నారు. బాలికకు కామ కోరికలు కలిగేలా ఇంజెక‌్షన్లు, ట్యాబ్లెట్లు ఇచ్చేవారు. ఆమెపై ఇష్టమొచ్చినప్పుడల్లా అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఆమెకు స్పృహ వచ్చినప్పుడు తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఆమెను బెదిరింపులకు పాల్పడేవారు. ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడతామని హెచ్చరించి ఆమెను నిర్బంధించారు. ఇలా 8 ఏళ్లుగా ముగ్గురు అత్యాచారానికి పాల్పడుతున్నారు. దీనికి నిందితుడి భార్య కూడా సహకరించేది. 

చివరకు వారి చెర నుంచి బయటకు వచ్చిన యువతి అంబోలి పోలీసులను సంప్రదించింది. 27 పేజీలతో ఆమె ఫిర్యాదు చేసింది. అయితే నిందితుల్లో ఓ వ్యక్తి తన కుమారుడికి పెళ్లి చేసేందుకు తనను ఉత్తరప్రదేశ్‌కు కూడా తీసుకెళ్లాడని ఫిర్యాదులో యువతి పేర్కొంది. కేసు నమోదు అనంతరం పోలీసులు నిందితులు నలుగురిని అరెస్ట్‌ చేశారు. పట్టుబడ్డ వారిలో నిందితుడి భార్య కూడా ఉంది. ఆమె తన భర్తకు సహకరించింది. నిందితులందరూ ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. బాలిక తప్పిపోయినప్పుడు ఆమె తల్లిదండ్రులు మిస్సింగ్‌ కేసు నమోదు చేయించారు. 8 ఏళ్ల తర్వాత తమ కూతురి ఆచూకీ లభించడంతో ఆమెను తల్లిదండ్రులు తీసుకెళ్లారు. నిందితులు బాధిత యువతి కుటుంబానికి తెలిసిన వారిగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement