
హైదరాబాద్: కోట్లాది మంది ఒక కుటుంబంలా ఉద్యమించి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఒక నాయకుడి కుటుంబం చేతిలో పెట్టామని ప్రజాకవి, గాయకుడు అందెశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం వస్తే కాపలా కుక్కలా ఉంటానన్న నాయకుడు ప్రజలను కుక్కలుగా చేసి పాలిస్తున్నారని పరోక్షంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ ‘తెలంగాణ సాంస్కృతిక సైన్యం’ ఆవిర్భావ సభ పోస్టర్‌ను తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావుతో కలసి ఆయన ఆవిష్కరించారు.
పార్టీకి అనుబంధంగా ఈ నెల 21న బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సాంస్కృతిక సైన్యం ఆవిర్భవించనుంది. ‘తెలంగాణ మట్టి చాలామంది లెక్కలు తేల్చింది. నిజాం పైజామా ఊడగొట్టింది, గడీలకు అగ్గి పెట్టింది. రాచరికాన్ని మట్టిలో కలిపింది. త్వరలోనే ఈ ప్రభుత్వ లెక్కలను సైతం తేలుస్తుంది’అని అందెశ్రీ అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, సాంస్కృతిక సైన్యం ఇన్‌చార్జ్ గుండమల్ల శ్రీనివాస్, కవి, రచయిత విష్ణు, సందీప్, కృష్ణమాదిగ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment