నితిన్ యెవ్లేకర్ కుటుంబాన్ని ఆదుకున్న హృతిక్! | Hrithik Roshan hails brave-heart fireman Nitin Yevlekar | Sakshi
Sakshi News home page

నితిన్ యెవ్లేకర్ కుటుంబాన్ని ఆదుకున్న హృతిక్!

Published Mon, Jul 21 2014 7:52 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

నితిన్ యెవ్లేకర్ కుటుంబాన్ని ఆదుకున్న హృతిక్! - Sakshi

నితిన్ యెవ్లేకర్ కుటుంబాన్ని ఆదుకున్న హృతిక్!

ముంబై: అగ్నిప్రమాదంలో చనిపోయిన అధికారి కుటుంబానికి బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ బాసటగా నిలిచారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అధికారి నితిన్ యెవ్లేకర్ కుటుంబానికి హృతిక్ ఆర్దిక సహాయంతో పాటు సంతాపాన్ని తెలియచేశారు. గత శుక్రవారం ముంబై సబర్బన్ అంధేరిలోని లోటస్ బిజినెస్ పార్క్ లోని 22 అంతస్తుల భవనంలో ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. 
 
ఈ భవనంలో హృతిక్ కుటుంబానికి ఐదు ఫ్లోర్లు ఉన్నాయి. ప్రమాదంలో మంటల్ని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తూ మరణించిన నితిన్ కుటుంబానికి 15 లక్షల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించినట్టు సమాచారం. అయితే హృతిక్ కుటుంబం అధికారికంగా ప్రకటించలేదు. 
 
మనకు అవసరం ఏర్పడినపుడు ఇతరులు సహాయం అందించడమనేది ప్రధానం. సహకరించుకోవడమే ముఖ్యం. ఇలాంటి సంఘటనల్లో మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి కుటుంబాన్ని ఆదుకోవడం ప్రధానం అని హృతిక్ ఓ ప్రకటనలో తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement