
మాటల మాంత్రికుడు కలానికి పదును పెట్టి మాటల తూటాలను పేల్చితే ఎలా ఉంటుందో.. యంగ్ టైగర్ తన నట విశ్వరూపాన్ని చూపితే ఎలా ఉంటుందో.. సరైన సినిమా పడితే కలెక్షన్లు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్రివిక్రమ్ ,ఎన్టీఆర్ కాంబినేషన్‌ల్లో రిలీజైన ‘అరవింద సమేత’ ఓవర్సీస్‌లో దూసుకెళ్తోంది.
మొదటి షోతోనే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లిన ఈ చిత్రం వసూళ్లలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఓవర్సీస్‌లో ఒక్కరోజులోనే మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకుంది. ఈ హవా చూస్తుంటే మూడు మిలియన్ల మార్క్‌ను కూడా అవలీలగా క్రాస్ చేసేలా కనిపిస్తోంది. ఈ సినిమా వసూళ్లలో ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో.. వేచి చూడాలి. జగపతి బాబు, నాగ బాబు, పూజా హెగ్డే, సునీల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతమందిచారు.
#MillionDollarAravindhaSametha 🔥 pic.twitter.com/XeBEGsNNY9
— #RageOfTiger / Vainavi Hanvi Creations (@vainavihanvi) 12 October 2018
చదవండి : ‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీ రివ్యూ