వంద కోట్ల క్లబ్‌లో మరో మూవీ! | raees movie enters into 100 crore club soon | Sakshi
Sakshi News home page

వంద కోట్ల క్లబ్‌లో మరో మూవీ!

Published Sun, Jan 29 2017 7:02 PM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM

వంద కోట్ల క్లబ్‌లో మరో మూవీ!

వంద కోట్ల క్లబ్‌లో మరో మూవీ!

రాహుల్‌ దోలాఖియా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'రాయిస్' భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ప్రధానపాత్రలో గత బుధవారం విడుదలైన ఈ మూవీకి భిన్న స్పందనలు వస్తున్నా, కలెక్షన్ల పరంగా సక్సెస్ వైపు నడుస్తోంది. ఓవరాల్‌గా శనివారం నాటికి రూ.121 కోట్లు వసూలు చేసింది. విదేశాలలో రూ.45.63 కోట్లు వసూలు చేసిన రాయిస్.. కేవలం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ ఏరియాలలో తొలి నాలుగు రోజుల్లో రూ.20.43 కోట్లు (మూడు మిలియన్ డాలర్లు) వసూలు చేసిందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.  

దేశ వ్యాప్తంగా రెండురోజుల్లో రూ. 46.72 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ నాలుగు రోజుల్లో రూ.75.44 కోట్లు రాబట్టిందని ట్వీట్ చేశారు. దీంతో ఓవరాల్‌గా రాయిస్ నాలుగోరోజు కలెక్షన్లతో వంద కోట్ల వసూళ్లతో దూసుకుపోతుంది. మంచి కలెక్షన్లు రాబట్టి రాయిస్ జబర్దస్త్‌గా రన్ అవుతుందని ట్వీట్‌లో రాసుకొచ్చారు. మరోవైపు హృతిక్ ఛాలెంజింగ్‌గా తీసుకుని అంధుడి పాత్రలో కనిపించిన మూవీ కాబిల్‌ కలెక్షన్లలో మాత్రం వెనకబడి పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement