రెండు రోజుల్లో రూ. 42 కోట్ల కలెక్షన్లు | MS Dhoni The Untold Story collects 41.90 crores in 2 days | Sakshi
Sakshi News home page

రెండు రోజుల్లో రూ. 42 కోట్ల కలెక్షన్లు

Published Sun, Oct 2 2016 12:22 PM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM

రెండు రోజుల్లో రూ. 42 కోట్ల కలెక్షన్లు

రెండు రోజుల్లో రూ. 42 కోట్ల కలెక్షన్లు

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ఎంఎస్ ధోనీ.. ది అన్టోల్డ్ స్టోరీ భారీ కలెక్షన్లు సాధిస్తోంది. శుక్రవారం దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి రెండు రోజుల్లో 41.90 కోట్ల రూపాయలు (గ్రాస్‌) వసూలు చేసింది. తొలిరోజు 21.30 కోట్ల రూపాయలు రాగా, రెండో రోజు శనివారం 20.60 కోట్లు వచ్చినట్టు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

ఆదివారం కలెక్షన్లు కలిపి మూడు రోజుల్లో 60 కోట్ల రూపాయల మార్క్‌ దాటుతుందని ఆదర్శ్‌ అంచనా వేశారు. బయోపిక్ సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. ఎంఎస్ ధోనీ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు రావడం, ప్రేక్షకుల్లో మంచి టాక్ రావడంతో భారీ కలెక్షన్లు వస్తున్నాయి. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుషాంత్ సింగ్ రాజ్పుట్ టైటిల్ రోల్ పోషించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement