MS Dhoni The Untold Story
-
వివాహాబంధంలోకి అడుగుపెట్టిన ఎంఎస్ ధోని నటి!
ప్రముఖ బాలీవుడ్ నటి వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఈ వేడుకలో స్విని ఖరా తన ప్రియుడిని పెళ్లాడింది. అమితాబ్ బచ్చన్ నటించిన చిత్రంలో బాలనటిగా మెప్పించిన స్వీని ఖరా కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. జైపూర్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో ఉర్విష్ దేశాయ్‌తో ఏడడుగులు నడిచారు. ఈ విషయాన్ని నటి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పెళ్లికి సంబధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు పలువురు సినీతారలు కూడా హాజరయ్యారు. కాగా.. స్విని 2005లో విద్యాబాలన్ నటించిన పరిణీతతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. అదే ఏడాది టీవీ సీరియల్ బా బహూ ఔర్ బేబీలో కూడా నటించింది. అమితాబ్ బచ్చన్. టబు, పరేష్ రావల్ నటించిన చిత్రం చీనీ కమ్. ఈ చిత్రంలో స్వినీ ఖరా బాలనటుడిగా 'సెక్సీ' అనే పాత్రను పోషించింది. ఆ తర్వాత ఆమె జాన్ అబ్రహం చిత్రం ఎలాన్, హరి పుత్తర్, షాహిద్ కపూర్ నటించిన పాఠశాల, ఢిల్లీ సఫారి, ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రాల్లో కనిపించింది. అంతే కాకుండా ధరి కా వీర్ యోధా పృథ్వీరాజ్ చౌహాన్, దిల్ మిల్ గయే, సీఐడీ, జిందగీ ఖట్టి మీథీ వంటి షోలు చేసింది. ఆమె వృత్తిరీత్యా న్యాయవాది కాగా.. చదువుపై దృష్టి పెట్టేందుకు నటనకు స్వస్తి చెప్పింది. View this post on Instagram A post shared by Swini Khara (@swinikhara) -
క్రికెట్ నేపథ్యంలో హిట్ కొట్టిన సినిమాలు.. ఈ ఓటీటీలలో చూడొచ్చు
వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత్ సత్తా చాటి మరికొన్ని గంటల్లో నేడు ఆస్ట్రేలియాతో ఫైనల్ ఫైట్‌కు రెడీ అయింది. లీగ్ దశలో పరాజయమే లేకుండా విజయ పరంపరతో కొనసాగిన భారత జట్టు.. అదే దూకుడుతో ఫైనల్ మ్యాచ్‌లోనూ వీర విజృంభణతో దూసుకెళ్లి కప్ సాధించాలని కోట్లాది మంది భారతీయులు ఆశిస్తున్నారు. అహ్మదాబాద్ వేదికగా నేటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు విద్యార్థులు, ఉద్యోగులూ, వ్యాపారులూ, సినీ సెలబ్రెటీలు తదితర క్రికెట్ క్రీడాభిమానులంతా సిద్ధమయ్యారు. ఇలాంటి సమయంలో క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన కొన్ని సూపర్ హిట్ సినిమాలను గుర్తుచేసుకుంటున్నారు. ఆ సినిమాలో ఏ ఓటీటీలో ఉన్నాయో అని తెగ వెతుకుతున్నారు. సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్ 2017లో 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' అనే చిత్రాన్ని జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వం వహించారు. భారతీయ త్రిభాషా డాక్యుమెంటరీ స్పోర్ట్స్ చిత్రంగా తెరకెక్కించారు. 200 నాటౌట్ ప్రొడక్షన్స్, కార్నివాల్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా రవి భాగ్చంద్కా, శ్రీకాంత్ భాసీ నిర్మించారు . ఈ చిత్రం భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జీవితంపై రూపొందించిన డాక్యుమెంటరీ.ఇది టెండూల్కర్ క్రికెట్, వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా చూపించారు. అలాగే అతని జీవితంలో ఇంతకు ముందెన్నడూ వినని లేదా చూడని కొన్ని అంశాలను కూడా ఈ చిత్రంలో చూడవచ్చు. ఇందులో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్ కూడా కొన్ని సీన్స్‌లలో కనిపిస్తారు. ఈ చిత్రం చూడాలనుకుంటే సోనీ లైవ్‌లో అందుబాటులో ఉంది. MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ 2016లో MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రం విడుదలైంది. ధోని బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. నీరజ్ పాండే రచించి దర్శకత్వం వహించారు. భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితం ఆధారంగారూపొందించబడింది. ఈ చిత్రంలో MS ధోనిగా దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించారు , వీరితో పాటు దిశా పటానీ , కియారా అద్వానీ, అనుపమ్ ఖేర్ నటించారు. ఈ చిత్రం ధోని చిన్నప్పటి నుంచి జీవితంలోని అనేక సంఘటనల ద్వారా అతని జీవితాన్ని వివరిస్తుంది. ధోనీ అంగీకారంతో ఈ సినిమా మొదలైంది. 61 దేశాలలో ఈ సినిమా విడుదలైంది. వాణిజ్యపరంగా ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇది 2016లో అత్యధిక వసూళ్లు చేసిన ఐదవ బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా రూ. 215.48 కోట్లు వసూలు చేసిన ఆరవ భారతీయ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను చూడాలనుకుంటే.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉచితంగానే చూడొచ్చు. 800 ముత్తయ్య మురళీధరన్ 2023లో తెలుగులో ఈ సినిమా విడుదలైంది. శ్రీలంక స్టార్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ రంగాచారి నిర్మించిన ఈ సినిమాకు ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించగా శ్రీదేవి మూవీస్ పై శివలెంక కృష్ణప్రసాద్ దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేశాడు. మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 6న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్స్ తీసిన ఏకైక బౌలర్‌గా ముత్తయ్య మురళీధరన్ ఉన్నారు. అందుకే ఈ చిత్రానికి 800 అనే టైటిల్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 2 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. 'ఆజార్' 2016లో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా 'ఆజార్' అనే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టోనీ డిసౌజా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ద్వారా శోభా కపూర్, ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇమ్రాన్ హష్మీ టైటిల్ రోల్లో సూపర్‌గా మెప్పించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 13 మే 2016న విడుదలైంది . అజార్ జీవితంలో మ్యాచ్ ఫిక్సింగ్, వివాహేతర సంబంధం వంటి అంశాలపై కూడా ఈ చిత్రంలో క్లారిటీ ఇచ్చారు. అజార్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమాలో ఇవే ► నాని నటించిన జెర్సీ ZEE5లో స్ట్రీమింగ్ అవుతుంది. ► గోల్కోండ హైస్కూల్ (సన్‌నెక్ట్స్) ► కౌసల్య కృష్ణమూర్తి (సన్‌నెక్ట్స్) ► విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' (అమెజాన్,డిస్నీ హాట్‌స్టార్) ► నాగచైతన్య 'మజిలీ' (అమెజాన్ ప్రైమ్ వీడియో) ► వెంకటేష్ 'వసంతం' (డిస్నీ హాట్‌స్టార్) ► లగాన్ హిందీ (నెట్‌ఫ్లిక్స్) -
ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..!
-
ధోని బయోపిక్ రీరిలీజ్.. సుశాంత్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
దిగంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఆయన నటించిన సూపర్ హిట్ మూవీ 'ఎంఎస్ ధోనీ ది అన్ టోల్డ్' స్టోరీ సినిమా ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అలా ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపాయి. చదవండి: అందుకే మేం విడాకులు తీసుకున్నాం.. నాగచైతన్య ఓపెన్ కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ నటించిన ఎంఎస్ ధోనీ సినిమాను రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 2016లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ ధోని పాత్రలో నటించగా, దిశా పటానీ, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు ముందు, ఆ తర్వాత కూడా పలు క్రీడాకారుల బయోపిక్‌తో సినిమాలు వచ్చినా 'ఎంఎస్ ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీ' అంతగా ఏ సినిమా ప్రభావం చూపలేదు..వసూళ్లు సాధించలేదు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా నడుస్తుండటంతో అటు క్రికెట్, ఇటు సినీ అభిమానుల కోసం ఈ సినిమాను మే12న మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. చదవండి: ఈ జన్మకు నువ్వు మాత్రమే.. ఆ ఙ్ఞాపకాలతో బతికేస్తాను : అలేఖ్య రెడ్డి Maahi phir aa raha hai!! M.S. Dhoni: The Untold Story Re-Releasing in cinemas on 12th May in Hindi, Tamil and Telugu#MSDhoniTheUntoldStory @msdhoni #sushantsinghrajput @starstudios_ @advani_kiara @DishPatani @AnupamPKher @bhumikachawlat pic.twitter.com/bOFtEaup4X — Ramesh Bala (@rameshlaus) May 4, 2023 -
నిశ్చితార్థం చేసుకున్న బాలీవుడ్ నటి.. పిక్స్ వైరల్
బాలీవుడ్లో పెళ్లిల్ల సందడి కొనసాగుతోంది. కొత్త ఏడాది ప్రారంభంలోనే కేఎల్ రాహుల్- అతియాశెట్టి, కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా జంటలు వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ నటి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. స్విని నిమేష్ ఖరా టీవీ షో బా బహూ ఔర్ బేబీలో కొంటె చైతాలి పాత్రకు గుర్తింపు తెచ్చుకుంది. 2007లో వచ్చిన అమితాబ్-టబు నటించిన చిత్రం చీనీ కమ్‌లో పోషించిన పాత్రకు ప్రసిద్ధి చెందింది. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్విని ఖరా నటించింది. ఈ చిత్రంలో బిగ్ బికి మంచి స్నేహితురాలిగా కనిపించింది. స్వినీ ఖరా సోషల్ మీడియా ద్వారా తన నిశ్చితార్థం అయినట్లు ప్రకటించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఇది చూసిన ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ఆమె స్నేహితులతో పాటు అవికా గోర్, నవికా కోటియా నూతన జంటకు కంగ్రాట్స్ చెప్పారు. కాగా.. స్విని ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రంలో భాగమైంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ఈ చిత్రంలో స్వినీ.. జయంతి అనే పాత్రను పోషించింది. ఆమె బా బహూ ఔర్ బేబీ, దిల్ మిల్ గయే, సీఐడీ, జిందగీ ఖట్టి మీథీ వంటి టీవీ షోలలో కూడా పనిచేసింది. View this post on Instagram A post shared by Swini Khara (@swinikhara) -
ధోని బయోపిక్ సీక్వెల్..!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు ఉత్సాహం కలిగించే వార్త ఒకటి బాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది. ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'ఎంఎస్ ధోని - ద అన్‌టోల్డ్ స్టోరీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో ఎంఎస్ ధోని చిత్రానికి సీక్వెల్ రూపొందించనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ధోని పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి.. ఫ్యాన్స్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఈ చిత్ర సీక్వెల్ కోసం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. 2011లో ప్రపంచకప్ విజయం తర్వాత ధోని జీవితంలోని ముఖ్య ఘట్టాలను సీక్వెల్లో చూపెట్టనున్నట్టు సమాచారం. ధోని వ్యక్తిగత జీవితాన్ని కూడా తెరపై అవిష్కరించే విధంగా సీక్వెల్‌ను రూపొందించాలని సుశాంత్ భావిస్తున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. మొదటి పార్ట్ మాదిరిగానే ఇందులో కూడా ధోని జీవితంలోని వాస్తవాలను చూపించేలా స్రిప్ట్ వర్క్ జరుగుతుందని వారు వెల్లడించారు. సీక్వెల్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ఇంకా ఖారారు కాలేదని పేర్కొన్నారు. ఈ చిత్ర షూటింగ్ వచ్చేడాది ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. కాగా, 2016లో విడుదలైన ఎంఎస్ ధోని చిత్రానికి నీరజ్ పాండే దర్శకత్వం వహించగా, దిశా పటాని, కైరా అద్వానీ ఇతర ముఖ్య పాత్రలో నటించారు. -
ధోనీ ఎంత వసూలు చేశాడో తెలుసా
టీమిండియా మిస్టర్ కూల్ కెప్టెన్‌గా పేరొందిన మహేంద్రసింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'ఎంఎస్ ధోనీ - ద అన్‌టోల్డ్ స్టోరీ' సినిమా వసూళ్లలో దూసుకుపోతోంది. ఇప్పటికే వంద కోట్లు దాటేసి, ఇప్పటివరకు దాదాపు రూ. 116 కోట్లు వసూలు చేసింది. ఇది కేవలం భారతీయ మార్కెట్లలో సాధించిన బిజినెస్ మాత్రమే. ఇప్పటివరకు జీవితచరిత్రల ఆధారంగా తీసిన సినిమాల్లో దేనికీ ఇంత పెద్దస్థాయిలో కలెక్షన్లు రాలేదు. నీరజ్ పాండే దర్శకత్వంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించిన ఈ సినిమా రాంచీ గల్లీల నుంచి టీమిండియా కెప్టెన్ వరకు ధోనీ ప్రయాణం ఎలా సాగిందన్న విషయాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. భారతీయ సినిమాలలో ఇప్పటివరకు జీవిత చరిత్రల మీద తీసినవాటిలో ఇదే అతిపెద్ద గ్రాసర్ అని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సీఈఓ విజయ్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. ధోనీ పట్ల భారతీయులకు ఉన్న అభిమానం ఈ కలెక్షన్ల రూపంలోనే తెలుస్తోందని ఆయన అన్నారు. క్రికెట్ అభిమానులు, సినిమా అభిమానులు అందరికీ తాము కృతజ్ఞులమై ఉంటామన్నారు. కొత్తగా మిర్జియా, తుటక్ తుటక్ తుటియా లాంటి సినిమాలు విడుదలైనా కూడా.. ధోనీ సినిమా మరిన్ని షోలు వేయాలంటూ డిమాండు పెరుగుతోందని నిర్మాతలు తెలిపారు. సుశాంత్ సరసన కియారా అద్వానీ, దిశా పటానీ నటించిన ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా నటించారు. #MSDhoniTheUntoldStory [Week 2] Fri 4.07 cr, Sat 5.20 cr, Sun 5.90 cr, Mon 3.40 cr, Tue 4.21 cr [Dussehra]. Total: ₹ 116.91 cr. India biz. — taran adarsh (@taran_adarsh) 12 October 2016 -
రూ.100 కోట్ల కలెక్షన్లు
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు 100 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది. బయోపిక్ సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా, ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో సుల్తాన్ తర్వాత అత్యధిక వీకెండ్ కలెక్షన్లు సాధించిన రెండో చిత్రంగా ఎంఎస్ ధోనీ నిలిచింది. భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్లో తొలి మూడు రోజుల్లో దాదాపు 22 కోట్ల రూపాయలు వసూలు సాధించింది. సోమ, మంగళవారాల్లో బాక్సాఫీసు వద్ద ఈ సినిమా జోరు కాస్త తగ్గినా కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుషాంత్ సింగ్ రాజ్పుట్ టైటిల్ రోల్ పోషించాడు. -
మూడో రోజు భారీ కలెక్షన్లు
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపిస్తోంది. తొలి మూడు రోజుల్లో 66 కోట్ల రూపాయలు (గ్రాస్) వసూళ్లు సాధించింది. తొలి రెండు రోజులతో పోలిస్తే మూడో రోజు ఈ సినిమాకు భారీ కలెక్షన్లు రావడం విశేషం. శుక్రవారం దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు తొలిరోజు 21.30 కోట్లు, రెండో రోజు శనివారం 20.60 కోట్లు రాగా, మూడో రోజు ఆదివారం 24.10 కోట్ల రూపాయలు వచ్చాయి. మూడు రోజుల్లో 60 కోట్ల రూపాయల మార్క్ దాటుతుందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ అంచనా వేసినట్టే జరిగింది. బయోపిక్ సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఇక ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అత్యధిక వీకెండ్ కలెక్షన్లలో సుల్తాన్ తర్వాత రెండో స్థానంలో ఎంఎస్ ధోనీ నిలిచింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో భారీ కలెక్షన్లు వస్తున్నాయి. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుషాంత్ సింగ్ రాజ్పుట్ టైటిల్ రోల్ పోషించాడు. -
రెండు రోజుల్లో రూ. 42 కోట్ల కలెక్షన్లు
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ భారీ కలెక్షన్లు సాధిస్తోంది. శుక్రవారం దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి రెండు రోజుల్లో 41.90 కోట్ల రూపాయలు (గ్రాస్) వసూలు చేసింది. తొలిరోజు 21.30 కోట్ల రూపాయలు రాగా, రెండో రోజు శనివారం 20.60 కోట్లు వచ్చినట్టు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఆదివారం కలెక్షన్లు కలిపి మూడు రోజుల్లో 60 కోట్ల రూపాయల మార్క్ దాటుతుందని ఆదర్శ్ అంచనా వేశారు. బయోపిక్ సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఎంఎస్ ధోనీ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు రావడం, ప్రేక్షకుల్లో మంచి టాక్ రావడంతో భారీ కలెక్షన్లు వస్తున్నాయి. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుషాంత్ సింగ్ రాజ్పుట్ టైటిల్ రోల్ పోషించాడు. -
తొలిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. శుక్రవారం దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలిరోజు రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. తొలిరోజు 21.30 (గ్రాస్) కోట్ల రూపాయలు వచ్చినట్టు టాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో సుల్తాన్ (36.54 కోట్లు) తర్వాత ఎంఎస్ ధోనీ రెండో స్థానంలో ఉంది. ఇక బయోపిక్ సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఎంఎస్ ధోనీ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు రావడం, ప్రేక్షకుల్లో మంచి టాక్ రావడంతో తొలిరోజు మాదిరే శని, ఆదివారాల్లో భారీ కలెక్షన్లు రావచ్చని భావిస్తున్నారు. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుషాంత్ సింగ్ రాజ్పుట్ టైటిల్ రోల్ పోషించాడు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ధోనీ పాల్గొనడంతో అభిమానుల్లో అమితాసక్తి ఏర్పడింది. -
ఆ ట్రైలర్ చూసి.. తండ్రి గుండె ఉప్పొంగింది!
'ఎంఎస్ ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ' సినిమా కోసం ధోనీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. రాంచీలోని ఓ మూరుమూ వీధి నుంచి ఇండియన్ క్రికెట్ కారిడర్లోకి, ప్రపంచ క్రికెట్లోకి అడుగుపెట్టి ఒక దిగ్గజంగా ధోనీ ఎలా ఎదిగాడు? అతని జీవితంలో బయటిప్రపంచానికి తెలియని రహస్యాలేమిటి? తదితర అంశాలను స్పృశిస్తూ ఈ సినిమా తెరకెక్కింది. ధోనీ కూల్ స్టైల్‌కి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. అందుకే సినిమాను చూసేందుకు దేశమంతటా యువత ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో 'ఎంఎస్ ధోనీ' సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అంశం వెలుగుచూసింది. టీవీలో ఈ సినిమా ట్రైలర్‌ను చూసిన ప్రతిసారి ధోనీ తండ్రి పాన్ సింగ్ ఉద్వేగానికి లోనవుతున్నారట. దేశంలో గొప్ప క్రికెటర్‌గా ఎదిగిన ధోనీని చూసి గర్వపడుతూనే.. అతను ఈ స్థాయి చేరుకోవడానికి పడ్డ కష్టం, అతని అకుంఠిత దీక్ష, పట్టుదల గుర్తొచ్చి ఆయన కళ్లు చెమరుస్తున్నాయి. తన కొడుకు పడిన కష్టం ఈ సినిమా ట్రైలర్ గుర్తుచేస్తుండటంతో.. ట్రైలర్ చూసిన ప్రతిసారి ఆయన ఒకింత భావోద్వేగానికి లోనవుతున్నారని సన్నిహితులు తెలిపారు. సుశాంత్ రాజ్‌పుత్ ధోనీగా నటించిన ఈ సినిమాను నీరజ్ పాండే తెరకెక్కించారు. ఫాక్స్ స్టార్ స్టూడియో, అరుణ్ పాండే ఈ సినిమాను నిర్మించారు. -
ధోనీకి రూ. 40 కోట్లు ఇవ్వలేదు
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథను సినిమాగా తీసేందుకు అతనికి 40 కోట్ల రూపాయలు ఇచ్చి హక్కులు పొందినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని దర్శకుడు నీరజ్ పాండే చెప్పాడు. ధోనీ జీవితకథ ఆధారంగా నీరజ్ దర్శకత్వంలో 'ఎంఎస్ ధోనీ.. ద అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెలాఖరులో విడుదలకానుంది. కాగా ఈ సినిమాలో ధోనీ మాజీ గాళ్ ఫ్రెండ్ పాత్ర ఉంటుందా అన్న విషయంపై నీరజ్ పెదవి విప్పలేదు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. విడుదలకు ముందే ఈ చిత్రం భారీస్థాయిలో బిజినెస్ చేసింది. 'ఎంఎస్ ధోనీ' సినిమా కోసం నిర్మాతలు రూ. 80 కోట్లవరకు ఖర్చు చేయగా, విడుదలకు ముందే 60 కోట్లు నిర్మాతల జేబుల్లోకి వచ్చిచేరాయి. ఈ సినిమా శాటిలైట్ హక్కులు రికార్డు స్థాయిలో రూ. 60 కోట్లకు అమ్ముడయ్యాయి. -
'సినిమా ధోనీ' ఎలా ఉంటాడంటే..?
ఒక సాదాసీదా టికెట్ కలెక్టర్ నుంచి.. క్రికెట్‌ను మతంగా భావించే దేశ జాతీయ జట్టుకు సారథిగా ఎదగడమంటే మాటలు కాదు. మైదానంలో మిస్టర్ కూల్ కెప్టెన్‌గా, ఆటలో ధనాధన్ ధోనీగా, భారత్‌కు రెండు ప్రపంచ్‌కప్‌లు అందించిన లెజెండరీ కెప్టెన్‌గా ప్రఖ్యాతిగాంచిన మహేంద్రసింగ్ ధోనీ జీవితంలో బయటి ప్రపంచానికి తెలియని ఒడిదుడుకులు ఎన్నో ఉన్నాయి. రాంచీలోని ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి.. క్రికెటర్‌గా, కెప్టెన్‌గా భారత్ జట్టుకు అద్భుత విజయాలు అందించిన ధోనీ జీవితకథ త్వరలో సినిమాగా రాబోతున్నది. 'ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ'గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తాజాగా బుధవారం విడుదలైంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్లో.. ధోనీగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు. నీరజ్ పాండే దర్శకత్వలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుశాంత్‌తోపాటు కియరా అద్వానీ, అనుపమ్ ఖేర్, భూమికా చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, సుశాంత్ రాజ్‌పుత్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా షేర్ చేశాడు.