రూ.100 కోట్ల కలెక్షన్లు | MS Dhoni collects 100 crores | Sakshi
Sakshi News home page

రూ.100 కోట్ల కలెక్షన్లు

Published Wed, Oct 5 2016 5:26 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

రూ.100 కోట్ల కలెక్షన్లు

రూ.100 కోట్ల కలెక్షన్లు

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ఎంఎస్ ధోనీ.. ది అన్టోల్డ్ స్టోరీ రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు 100 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది.

బయోపిక్ సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనర్గా, ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో సుల్తాన్ తర్వాత అత్యధిక వీకెండ్ కలెక్షన్లు సాధించిన రెండో చిత్రంగా ఎంఎస్ ధోనీ నిలిచింది. భారత్తో పాటు విదేశాల్లోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్లో తొలి మూడు రోజుల్లో దాదాపు 22 కోట్ల రూపాయలు వసూలు సాధించింది. సోమ, మంగళవారాల్లో బాక్సాఫీసు వద్ద ఈ సినిమా జోరు కాస్త తగ్గినా కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుషాంత్ సింగ్ రాజ్పుట్ టైటిల్ రోల్ పోషించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement