బాలీవుడ్‌లో పెళ్లిల్ల సందడి కొనసాగుతోంది. కొత్త ఏడాది ప్రారంభంలోనే కేఎల్ రాహుల్- అతియాశెట్టి, కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా జంటలు వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ నటి ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
స్విని నిమేష్ ఖరా టీవీ షో బా బహూ ఔర్ బేబీలో కొంటె చైతాలి పాత్రకు గుర్తింపు తెచ్చుకుంది. 2007లో వచ్చిన అమితాబ్-టబు నటించిన చిత్రం చీనీ కమ్‌లో పోషించిన పాత్రకు ప్రసిద్ధి చెందింది. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్విని ఖరా నటించింది. ఈ చిత్రంలో బిగ్ బికి మంచి స్నేహితురాలిగా కనిపించింది. స్వినీ ఖరా సోషల్ మీడియా ద్వారా తన నిశ్చితార్థం అయినట్లు ప్రకటించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది.
ఇది చూసిన ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ఆమె స్నేహితులతో పాటు అవికా గోర్, నవికా కోటియా నూతన జంటకు కంగ్రాట్స్ చెప్పారు. కాగా.. స్విని ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రంలో భాగమైంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ఈ చిత్రంలో స్వినీ.. జయంతి అనే పాత్రను పోషించింది. ఆమె బా బహూ ఔర్ బేబీ, దిల్ మిల్ గయే, సీఐడీ, జిందగీ ఖట్టి మీథీ వంటి టీవీ షోలలో కూడా పనిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment