MS Dhoni biopic
-
ధోని జీవితంలో తీరని విషాదం..! మిస్టర్ కూల్ నాలో ఆ అమ్మాయిని చూస్తాడనుకున్నా..
టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని.. ఆటలో తనకు తానే సాటి. భారత్‌కు ఏకంగా మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన సారథిగా రికార్డులకెక్కిన ఈ జార్ఖండ్ డైనమైట్.. ఐపీఎల్‌లోనూ హవా కొనసాగిస్తున్నాడు. 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదోసారి విజేతగా నిలిపి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ధోని కెరీర్ గురించి కాసేపు పక్కన పెడితే.. అతడి వ్యక్తిగత జీవితంలో తీరని విషాదం ఉందన్న విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు. అవును.. ధోని తన ఫస్ట్‌లవ్‌ను కోల్పోయాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి అకస్మాత్తుగా ఈ లోకాన్ని వీడటంతో అతడి కలల ప్రపంచం శూన్యమైంది. ఇంతకీ ధోని ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరు? ఆమెతో జీవితం పంచుకోవాలనుకున్నాడు! 2002.. ధోని అప్పుడప్పుడే జాతీయ జట్టులోకి రావాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. అదే సమయంలో ప్రియాంక ఝా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. తనతోనే జీవితాన్ని పంచుకోవాలని కోరుకున్నాడు. కానీ విధిరాత మరోలా ఉంది. దురదృష్టవశాత్తూ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రియాంక ఝా కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన నుంచి కోలుకునేందుకు ధోనికి చాలా సమయమే పట్టింది. ధోని అనుమతి తీసుకున్న తర్వాతే ఈ విషయాలను ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమాలో చూపించారు. ధోనిగా దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ప్రియాంక ఝా క్యారెక్టర్లో దిశా పటాని, ధోని సతీమణి సాక్షిగా కియారా అద్వానీ నటించారు. కాగా ధోని ఫస్ట్‌లవ్ గురించి సినిమాలో చూపించేందుకు దర్శకుడు నీరజ్ పాండే ముందుగానే అనుమతి తీసుకున్నాడు. తొలుత ఇందుకు ధోని నిరాకరించినా తన జీవితంలోని సంఘటనలు ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో ఉన్న డైరెక్టర్ ప్రతిపాదనకు అంగీకరించాడట. అయితే, కొంతమంది మాత్రం ప్రియాంక .. ధోని చిన్ననాటి స్నేహితులు మాత్రమే అని చెప్పడం గమనార్హం. అదే విధంగా.. సినిమాలో ఈ విషయాలు చూపించారే తప్ప ధోని కూడా ఎప్పుడూ దీని గురించి మాట్లాడింది లేదు. ధోని మూవీలో తన పాత్ర గురించి దిశా గతంలో మాట్లాడుతూ.. ‘‘నిజ జీవిత పాత్రలతో ఈ సినిమా రూపొందించారు. మీరంతా కియారాలో సాక్షిని, సుశాంత్‌లో ధోనిని చూస్తారు. అయితే, ధోని మాత్రం నాలో ప్రియాంక చూస్తాడని అనుకున్నా’’ అని పేర్కొంది. జింబాబ్వే, కెన్యా టూర్లో ఉన్న సమయంలో.. ఇక తన జీవితంలోని చేదు ఘటన సమయంలోనే ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇండియా- ‘ఏ’ జట్టుకు ఎంపిక అయ్యాడు. కెరీర్ గాడిన పడుతుందనుకుంటున్న సమయంలో పిడుగులాంటి వార్త ధోని ప్రేమసౌధాన్ని కూల్చివేసింది. 2003-04 జింబాబ్వే- కెన్యా పర్యటనలో ధోని వరుస సెంచరీలతో అదరగొట్టాడు. కెన్యా, పాకిస్తాన్‌తో ట్రై సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లో 362 పరుగులతో సత్తా చాటాడు. తద్వారా నాటి టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ, తాత్కాలిక కోచ్ రవిశాస్త్రి దృష్టిని ఆకర్షించాడు. అలా 2004లో బంగ్లాదేశ్ టూర్ సందర్భంగా టీమిండియా వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. సాక్షితో వివాహం ఇక ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ టీమిండియా మేటి కెప్టెన్‌గా ఎదిగాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే.. ప్రియాంక తర్వాత సాక్షి సింగ్ రావత్ ధోని జీవితంలోకి వచ్చింది. 2010లో వీరి వివాహం జరిగింది. ఈ జంటకు కూతురు జీవా సంతానం. కాగా వచ్చే నెల(జూలై) 7న ధోని పుట్టినరోజు సందర్భంగా ధోని సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు సమాచారం. చదవండి: జింబాబ్వే సంచలనం.. వన్డేల్లో అత్యధిక స్కోర్ నమోదు! ఇంతటి విషాదమా! పాపం.. పిల్లల ముద్దూముచ్చట్లు చూడకుండానే.. మళ్లీ.. -
ధోని బయోపిక్ రీరిలీజ్.. సుశాంత్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
దిగంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఆయన నటించిన సూపర్ హిట్ మూవీ 'ఎంఎస్ ధోనీ ది అన్ టోల్డ్' స్టోరీ సినిమా ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అలా ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపాయి. చదవండి: అందుకే మేం విడాకులు తీసుకున్నాం.. నాగచైతన్య ఓపెన్ కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ నటించిన ఎంఎస్ ధోనీ సినిమాను రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 2016లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ ధోని పాత్రలో నటించగా, దిశా పటానీ, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు ముందు, ఆ తర్వాత కూడా పలు క్రీడాకారుల బయోపిక్‌తో సినిమాలు వచ్చినా 'ఎంఎస్ ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీ' అంతగా ఏ సినిమా ప్రభావం చూపలేదు..వసూళ్లు సాధించలేదు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా నడుస్తుండటంతో అటు క్రికెట్, ఇటు సినీ అభిమానుల కోసం ఈ సినిమాను మే12న మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. చదవండి: ఈ జన్మకు నువ్వు మాత్రమే.. ఆ ఙ్ఞాపకాలతో బతికేస్తాను : అలేఖ్య రెడ్డి Maahi phir aa raha hai!! M.S. Dhoni: The Untold Story Re-Releasing in cinemas on 12th May in Hindi, Tamil and Telugu#MSDhoniTheUntoldStory @msdhoni #sushantsinghrajput @starstudios_ @advani_kiara @DishPatani @AnupamPKher @bhumikachawlat pic.twitter.com/bOFtEaup4X — Ramesh Bala (@rameshlaus) May 4, 2023 -
నిశ్చితార్థం చేసుకున్న బాలీవుడ్ నటి.. పిక్స్ వైరల్
బాలీవుడ్లో పెళ్లిల్ల సందడి కొనసాగుతోంది. కొత్త ఏడాది ప్రారంభంలోనే కేఎల్ రాహుల్- అతియాశెట్టి, కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా జంటలు వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ నటి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. స్విని నిమేష్ ఖరా టీవీ షో బా బహూ ఔర్ బేబీలో కొంటె చైతాలి పాత్రకు గుర్తింపు తెచ్చుకుంది. 2007లో వచ్చిన అమితాబ్-టబు నటించిన చిత్రం చీనీ కమ్‌లో పోషించిన పాత్రకు ప్రసిద్ధి చెందింది. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్విని ఖరా నటించింది. ఈ చిత్రంలో బిగ్ బికి మంచి స్నేహితురాలిగా కనిపించింది. స్వినీ ఖరా సోషల్ మీడియా ద్వారా తన నిశ్చితార్థం అయినట్లు ప్రకటించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఇది చూసిన ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ఆమె స్నేహితులతో పాటు అవికా గోర్, నవికా కోటియా నూతన జంటకు కంగ్రాట్స్ చెప్పారు. కాగా.. స్విని ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రంలో భాగమైంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ఈ చిత్రంలో స్వినీ.. జయంతి అనే పాత్రను పోషించింది. ఆమె బా బహూ ఔర్ బేబీ, దిల్ మిల్ గయే, సీఐడీ, జిందగీ ఖట్టి మీథీ వంటి టీవీ షోలలో కూడా పనిచేసింది. View this post on Instagram A post shared by Swini Khara (@swinikhara) -
ధోనీ విగ్రహం చేసినతనే ఆదిపురుష్ గ్రాఫిక్స్ చేశాడా ...?
-
‘అక్షయ్‌ని కాదని సుశాంత్‌ను తీసుకున్నాను’
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న ముంబైలో కన్ను మూసిన సంగతి తెలిసిందే. డిప్రెషన్‌తో బాధపడుతున్న సుశాంత్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ క్రమంలో ధోని బయోపిక్కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. మాజీ భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర కోసం తనను తీసుకోవాల్సిందిగా అక్షయ్ కుమార్ ఆ చిత్ర దర్శకుడు నీరజ్ పాండేను కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో 2017లో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ‘నీరజ్ పాండే ధోని బయోపిక్ తెరకెక్కిస్తున్నారని నాకు తెలిసింది. దాంతో ఆ చిత్రంలో ధోని పాత్ర కోసం నన్ను తీసుకోవాల్సిందిగా నీరజ్‌ను కోరాను. కానీ అతడు సున్నితంగా తిరస్కరించాడు’ అని తెలిపారు. ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోని పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. (ఐ వాన్న అన్‌ఫాలో యు) దీనిపై నీరజ్ పాండే స్పందిస్తూ.. ‘ఈ చిత్రంలో ధోని యుక్తవయస్సులో వచ్చే సన్నివేశాలు కూడా ఉంటాయి. 16-17 ఏళ్ల యువకుడిగా నటించాల్సి ఉంటుంది. ఆ వెర్షన్ అక్షయ్‌కు సూట్ కాదు. అందుకే అతడి అభ్యర్థనను తిరస్కరించాను’ అన్నాడు. అంతేకాక ఈ చిత్రంలో సుశాంత్ నటన గురించి మాట్లాడుతూ.. ‘తను చాలా మంచి నటుడు. ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు సుశాంత్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు. స్క్రిప్ట్‌ను పూర్తిగా చదివాడు. ధోని బాడీ లాంగ్వేజ్‌ను ఎంతో బాగా అనుకరించాడు’ అని తెలిపారు. ‘ఎమ్ఎస్ ధోని: అన్‌టోల్డ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం 133 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. సుశాంత్ నటనను విమర్శకులు సైతం ప్రశంసించారు. (ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నాం) -
‘అప్పుడు సుశాంత్‌కు ఎన్నో గాయాలయ్యాయి’
ముంబై: పని పట్ల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంకితభావం తనను ఎంతగానో ఆకట్టుకుందని టీమిండియా మాజీ ఆటగాడు, సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కిరణ్ మోరె అన్నారు. ధోని బయోపిక్ కోసం సుశాంత్ తన వద్ద 9 నెలల కఠోర సాధన చేశాడని తెలిపారు. ధోని తరహా ఆటతీరు కనబర్చే ప్రయత్నంలో అతను ఎన్నో గాయాలపాలయ్యాడని చెప్పారు. ఆక్రమంలోనే పక్కటెముకల గాయంతో 10 రోజులపాటు కోచింగ్‌కు దూరమయ్యాడని మోరె గుర్తు చేసుకున్నారు. కఠోర సాధనతో కష్టసాధ్యమైన కీపింగ్ నేర్చుకున్నాడని, ఫాస్ట్ బౌలర్లు, బౌలింగ్ మెషీన్ వేసే బంతుల్ని ఎదుర్కొనే క్రమంలో అతని పోరాటపటిమకు తాను ముగ్ధుణ్ని అయ్యానన్నారు. (చదవండి: 'కావాలనే సుశాంత్‌ని 7 సినిమాల్లో తప్పించారు') ‘నెట్స్‌లో సాధన చేసేటప్పుడు సుశాంత్‌తో మాటలకన్నా.. ఒకరకమైన తిట్లతోనే గడిచిపోయేది. అయినప్పటికీ అతను నాపై ఎప్పుడూ అసహనం వ్యక్తం చేయలేదు. ఆటపైనే దృష్టి పెట్టేవాడు. తెల్లవారు జామున, సాయంత్రం వేళల్లో, ఇటి దగ్గరా సుశాంత్ ప్రాక్టీస్ చేసి.. ఆ విశేషాలను నాతో పంచుకునేవాడు. మొత్తంమీద కోచింగ్ పూర్తయ్యేటప్పటికీ మా మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొంది. ధోని బయోపిక్‌కోసం అతని నిబద్థత చూసి.. ఆ సినిమా చక్కగా వస్తుందనుకున్నా. దాంతోపాటు సుశాంత్ కెరీర్లో ఇది అద్భుతమైన పాత్ర అవుందని, నటుడిగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడని భావించా. ధోని తర్వాత హెలికాప్టర్ షాట్స్‌తో అదరగొట్టిన రెండో వ్యక్తి సుశాంతే. అదే విషయం తనదో చెప్పా. తను పొంగిపోయాడు. నెలన్నర కష్టపడి అతను హెలికాప్టర్ షాట్స్ ఆడటం నేర్చుకున్నాడు. అనంతరం అలవోకగా.. రోజూ 100 షాట్లు ఆడాడు. మూడు నాలుగు గంటల సెషన్లో 300 నుంచి 400 బంతుల్ని సుశాంత్ ఎదుర్కొనేవాడు. అలసటే లేకుండా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యేవాడు. తనను ఔట్ చెయ్యాలని నెట్ బౌలర్లకు చాలెంజ్ చేసేవాడు’అని కిరణ్ మోరె సుశాంత్‌తో సాగిన కోచింగ్ విశేషాలను నెమరేసుకున్నారు. కాగా, ముంబైలోని తన నివాసంలో సుశాంత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: ఇక్కడ ఎవరూ ఎవరినీ పట్టించుకోరు: సైఫ్ అలీఖాన్) -
సుశాంత్ ఎందుకిలా చేశావ్: వాట్సన్
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటనపై సినీ, క్రీడా ప్రముఖులు తీవ్ర విచారం వెలిబుచ్చారు. గొప్ప ప్రతిభ, కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ సుశాంత్ బలవన్మరణానికి పాల్పడటం కలచివేస్తోందని అంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ షేన్ వాట్సన్ సుశాంత్ మృతిపట్ల నివాళి అర్పించారు. చక్కని ప్రతిభ త్వరగా కనుమరుగైపోయిందని ట్విటర్లో పేర్కొన్నాడు. (చదవండి: డిప్రెషన్‌ను జయించండిలా..) సుశాంత్ ఎందుకిలా చేశాడో ఆలోచించడం ఆపలేకపోతున్నానని తెలిపారు. ‘ఇది చాలా విషాదకర ఘటన. ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమా చూస్తున్న సమయంలో నటిస్తోంది ధోనియా, సుశాంతా అనే విషయం మర్చిపోయి చక్కని అనుభూతి పొందా. ఆ సినిమాలో సుశాంత్ అత్యద్భుతంగా నటించి వినోదం పంచాడు. అంతలోనే ఈ ప్రపంచాన్ని ఒంటరి చేసి దిగంతాలకు పయనమయ్యాడు. గొప్ప ప్రతిభ త్వరగా కనుమరుగైంది’అని వాట్సన్ ట్వీట్ చేశాడు. (చదవండి: ఆవేదన వ్యక్తం చేసిన ‘బిగ్ బీ’) I can’t stop thinking about #sushantsinghrajput. It is just so tragic!!! In The Untold Story, at times you forgot whether it was Sushant or MSD. Amazing portrayal and now the world is much poorer with him not here in it. #gonetoosoon pic.twitter.com/pFYz4cD9jK — Shane Watson (@ShaneRWatson33) June 15, 2020 -
సుశాంత్‌సింగ్ ఆత్మహత్య
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కన్నుమూశారు. ఆయన ముంబైలోని బాంద్రాలో తన నివాసంలో ఆదివారం ఉరి వేసుకున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. యువ నటుడి బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు సాగిస్తున్నామని వెల్లడించారు. మెడికల్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. సుశాంత్‌సింగ్ కేవలం 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడం పట్ల బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిహార్ రాజధాని పాట్నాకు చెందిన ఆయన తొలుత టీవీ సీరియళ్లలో నటించారు. అనంతరం హిందీ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. సుశాంత్‌కు తండ్రి, నలుగురు అక్కలు ఉన్నారు. తల్లి 2002లో మరణించారు. ఆయన మాజీ మేనేజర్ దిశా సలియాన్(28) జూన్ 9న ఓ బహుళ అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇంజనీరింగ్ మధ్యలోనే ఆపేసి... ఢిల్లీ టెక్నోలాజికల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థి అయిన సుశాంత్‌సింగ్ మధ్యలోనే చదువు ఆపేశారు. కొరియోగ్రాఫర్ షియామక్ దేవర్ వద్ద నృత్యంలో శిక్షణ పొందారు. 2006లో విడుదలైన ధూమ్ 2 సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కొంతసేపు కనిపించారు. 2009లో ప్రసారమైన పవిత్ర రిస్తా సీరియల్లో నటించారు. 2011లో కై పో చే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. శుద్ధ్ దేశీ రోమాన్స్, రాబ్తా, కేదార్నాథ్, ఎంఎస్ ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ, చిచోరీ తదితర చిత్రాల్లో నటించారు. క్రికెటర్ ధోనీ బయోపిక్ అయిన ఎంఎస్ ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ చిత్రం సుశాంత్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. చివరిసారిగా 2019లో చిచోరే చిత్రంలో వెండితెరపై కనిపించారు. సుశాంత్ అంత్యక్రియలు సోమవారం ముంబైలో జరగనున్నట్లు సమాచారం. బంధువులు పట్నా నుంచి ముంబైకి చేరుకుంటున్నారు. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రకాశ్ జవదేకర్, సినీ నటులు షారుక్ ఖాన్, అనిల్‌కపూర్, కరణ్ జోహార్, క్రికెటర్ విరాట్ కోహ్లీ తదితరులు సంతాపం ప్రకటించారు. ప్రతిభావంతుడైన నటుడు దూరం కావడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. -
తొందరగా వెళ్లిపోయావ్ మిత్రమా!
న్యూఢిల్లీ: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాలీవుడ్ నటుడే కానీ క్రికెట్ చూసే ప్రతీ ఒక్కరికీ అతనో ‘బాలీవుడ్ ఎంఎస్ ధోని’. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధారంగా నిర్మించిన ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమాలో మహి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అతను క్రికెట్ వర్గాలకు సుపరిచితుడయ్యాడు. డిప్రెషన్ కారణంగా 34 ఏళ్ల సుశాంత్ ముంబైలోని తన ఇంట్లో ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడటంతో క్రికెట్ వర్గాలు విస్తుపోయాయి. పలువురు క్రికెటర్లు సుశాంత్ విషాదాంతంపై విస్మయానికి లోనయ్యారు. చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయావు మిత్రమా అంటూనే... ఈ వార్త అబద్ధమైతే బావుండంటూ సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు. సుశాంత్ మరణం కలిచి వేస్తోంది. అతనో ప్రతిభావంతుడైన యువ నటుడు. వారి కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. –సచిన్ టెండూల్కర్ ఈ వార్త విని షాకయ్యా. ఇది జీర్ణించుకోవడం కష్టం. దేవుడు వారి కుటుంబానికి ధైర్యాన్నివ్వాలి. – కోహ్లి దీన్ని నమ్మాలనిపించట్లేదు. చాలా బాధగా ఉంది. నీ ఆత్మకు శాంతి కలగాలి బ్రదర్. –రోహిత్ శర్మ షాకింగ్, నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. సుశాంత్ కుటుంబం కోసం ప్రార్థిస్తా. –శిఖర్ ధావన్ జీవితం సున్నితమైనది. ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందరితో దయతో మెలగండి. ఓం శాంతి. –వీరేంద్ర సెహ్వాగ్ నిజంగా దీన్ని నమ్మలేను. ఓ ప్రతిభావంతుడైన యువకుడి జీవితం ఇలా ముగుస్తుందనుకోలేదు. లోపలి సంఘర్షణను ఎవరూ తెలుసుకోలేరు. –యువరాజ్ సింగ్ మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన సందర్భమిది. సుశాంత్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. –వీవీఎస్ లక్ష్మణ్ నీకు ఇంకా చాలా అందమైన జీవితం ఉంది. చాలా తొందరగా వెళ్లిపోయావు సుశాంత్. –షోయబ్ మలిక్ (పాక్ క్రికెటర్) షాకింగ్. చాలా తొందరగా వెళ్లిపోయావు. ఆన్‌స్క్రీన్ ధోనిని కోల్పోయాం. –సైనా నెహ్వాల్ (స్టార్ షట్లర్) సుశాంత్ మనం ఇద్దరం కలిసి టెన్నిస్ ఆడదామని చెప్పావ్. నువ్వున్న చోటల్లా సంతోషం, నవ్వులు పంచావ్. చివరకు ఇంత బాధపెడతావ్ అనుకోలేదు. హృదయం బద్ధలవుతోంది. –సానియా మీర్జా (టెన్నిస్ స్టార్) ఆ అందమైన నవ్వు వెనక ఎంత సంఘర్షణ దాగుందో తెలుసుకోలేకపోయాం. చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నావు. మేం నిన్ను కోల్పోయాం. –మిథాలీ రాజ్ ఎవరైనా ఇది అబద్ధమని చెప్పండి. సుశాంత్ లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. –హర్భజన్ ఈ విషాదాంతం షాకింగ్‌గా ఉంది. కుటుంబానికి, అభిమానులకు నా సంతాపం. –రవిశాస్త్రి మనం ఒక అందమైన పిల్లాడిని, విద్యావంతుణ్ని, కష్టపడి విజయాన్ని సాధించిన వ్యక్తిని కోల్పోయాం. ధోని సినిమా కోసం 9 నెలలు ప్రొఫెషనల్ క్రికెటర్లా ప్రాక్టీస్ చేశాడు. హెలికాప్టర్ షాట్లో పరిపూర్ణత సాధించాడు. ఎన్ని గాయాలు తగిలినా వికెట్‌కీపింగ్ కోసం సిద్ధంగా ఉండేవాడు. అద్భుతమైన తన ప్రయాణాన్ని అర్ధాంతరంగా ముగించాడు. నమ్మలేకపోతున్నా. –కిరణ్ మోరే (ధోని బయోపిక్ కోసం భారత మాజీ వికెట్ కీపర్ మోరే వద్ద సుశాంత్ శిక్షణ తీసుకున్నాడు) -
12 నిజ జీవిత పాత్రల్లో యంగ్ హీరో
ఎమ్ఎస్ ధోని బయోపిక్‌తో ఒక్కసారిగా స్టార్ లీగ్‌లో ఎంటర్ అయిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ధోని పాత్రలో జీవించిన ఈ యువ నటుడు ఇప్పుడు మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 12 నిజజీవిత పాత్రల్లో నటించేందుకు ఓకె చెప్పాడు. 540బిసి నుంచి 2015 ఏడి మధ్య కాలానికి చెందిన 12 మంది మేధావుల జీవితాలను సిరీస్‌గా రూపొందిస్తున్నారు. ఈ సిరీస్‌లో చాణక్యుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం లాంటి వారి జీవితాలను తెరకెక్కించనున్నారు. ఈ 12 కథలో లీడ్ రోల్స్‌లో నటించేందుకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ రెడీ అవుతున్నాడు. తన స్నేహితుడు వరుణ్ మథుర్‌తో కలిసి సుశాంత్ ఈ సిరీస్‌ను స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ధోని సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ ఈ సిరీస్ మరింత పేరు తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. -
‘ఎంఎస్ ధోనీ’లో నా పాత్ర ఉండదు: లక్ష్మీరాయ్
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన బాలీవుడ్ సినిమా ఎంఎస్ ధోనీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ప్రమోషన్లో యూనిట్‌తో పాటు ధోనీ కూడా పాల్గొనడంపై మరింత ప్రచారం వచ్చింది. త్వరలో విడుదలవుతున్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటు దక్షిణాది హీరోయిన్ లక్ష్మీ రాయ్ కూడా ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఎంఎస్ ధోనీ సినిమాలో రాయ్ పాత్ర ఉంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. 2008లో ధోనీ.. రాయ్‌తో ఎఫైర్ నడిపినట్టు పుకార్లు షికార్లు చేశాయి. ఈ విషయంపై లక్ష్మీ రాయ్ స్పందిస్తూ.. ఎంఎస్ ధోనీ సినిమాలో తన పాత్ర ఉంటుందని భావించడంలేదని చెప్పింది. తన గతం గురించి అనవసరంగా చర్చించుకుంటున్నారని రుసరుసలాడింది. ’2008 ఐపీఎల్ సందర్భంగా ఓ ఏడాది పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాను. ఆ సమయంలో ధోనీతో పరిచయం ఏర్పడింది. అయితే మాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. ఆ ఐపీఎల్ సీజన్ ముగిశాక చెన్నై జట్టుతో అనుబంధం ముగిసింది. ఆ తర్వాత ధోనీతో టచ్‌లో లేను. అంతటితో ఆ అధ్యాయం ముగిసింది. ధోనీతో తనకు ఎఫైర్ ఉన్నట్టు ఎనిమిదేళ్ల తర్వాత కూడా ఎందుకు మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఈ సినిమా కథ గురించి తెలుసుకునేందుకు నేను ప్రయత్నించాను. అయితే ఎలాంటి సమాచారం తెలియలేదు’ అని లక్ష్మీ రాయ్ చెప్పింది. ధోనీకి గతంలో ప్రియాంక ఝా అనే గాళ్ ఫ్రెండ్ ఉండేది. ఆమె ప్రమాదంలో మరణించింది. ఎంఎస్ ధోనీ సినిమాలో ప్రియాంక ఝాతో పాటు లక్ష్మీ రాయ్ పాత్రలు ఉంటాయని భావిస్తున్నారు. 2010లో ధోనీ సాక్షి రావత్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఎంఎస్ ధోనీ సినిమాలో అతని గాళ్ ఫ్రెండ్స్ పాత్రలు ఉంటాయా లేవా అన్నది తెరపై చూడాలి. -
ధోనీకి రూ. 40 కోట్లు ఇవ్వలేదు
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథను సినిమాగా తీసేందుకు అతనికి 40 కోట్ల రూపాయలు ఇచ్చి హక్కులు పొందినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని దర్శకుడు నీరజ్ పాండే చెప్పాడు. ధోనీ జీవితకథ ఆధారంగా నీరజ్ దర్శకత్వంలో 'ఎంఎస్ ధోనీ.. ద అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెలాఖరులో విడుదలకానుంది. కాగా ఈ సినిమాలో ధోనీ మాజీ గాళ్ ఫ్రెండ్ పాత్ర ఉంటుందా అన్న విషయంపై నీరజ్ పెదవి విప్పలేదు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. విడుదలకు ముందే ఈ చిత్రం భారీస్థాయిలో బిజినెస్ చేసింది. 'ఎంఎస్ ధోనీ' సినిమా కోసం నిర్మాతలు రూ. 80 కోట్లవరకు ఖర్చు చేయగా, విడుదలకు ముందే 60 కోట్లు నిర్మాతల జేబుల్లోకి వచ్చిచేరాయి. ఈ సినిమా శాటిలైట్ హక్కులు రికార్డు స్థాయిలో రూ. 60 కోట్లకు అమ్ముడయ్యాయి.