Sushant Singh Rajput MS Dhoni The Untold Story To Re-Release - Sakshi
Sakshi News home page

Ms Dhoni The Untold Story: సుశాంత్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..మరోసారి వెండితెరపై ‘ఎంఎస్ ధోనీ’ బయోపిక్‌..

Published Fri, May 5 2023 7:49 PM | Last Updated on Fri, May 5 2023 8:27 PM

Sushant Singh Rajput Ms Dhoni The Untold Story To Re Release - Sakshi

దిగంగత బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌. ఆయన నటించిన సూపర్ హిట్‌ మూవీ 'ఎంఎస్ ధోనీ ది అన్ టోల్డ్' స్టోరీ సినిమా ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అలా ఎ‍న్నో సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపాయి. చదవండి: అందుకే మేం విడాకులు తీసుకున్నాం.. నాగచైతన్య ఓపెన్‌ కామెంట్స్‌

ఇప్పుడు బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ నటించిన ఎంఎస్ ధోనీ సినిమాను రీరిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 2016లో విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ ధోని పాత్రలో నటించగా, దిశా పటానీ, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు.



ఈ సినిమాకు ముందు, ఆ తర్వాత కూడా పలు క్రీడాకారుల బయోపిక్‌తో సినిమాలు వచ్చినా 'ఎంఎస్ ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీ' అంతగా ఏ సినిమా ప్రభావం చూపలేదు..వసూళ్లు సాధించలేదు. ఇప్పుడు ఐపీఎల్‌ సీజన్‌ కూడా నడుస్తుండటంతో అటు క్రికెట్‌, ఇటు సినీ అభిమానుల కోసం ఈ సినిమాను మే12న  మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. చదవండి: ఈ జన్మకు నువ్వు మాత్రమే.. ఆ ఙ్ఞాపకాలతో బతికేస్తాను : అలేఖ్య రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement