టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని.. ఆటలో తనకు తానే సాటి. భారత్‌కు ఏకంగా మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన సారథిగా రికార్డులకెక్కిన ఈ జార్ఖండ్ డైనమైట్.. ఐపీఎల్‌లోనూ హవా కొనసాగిస్తున్నాడు. 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదోసారి విజేతగా నిలిపి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ధోని కెరీర్ గురించి కాసేపు పక్కన పెడితే.. అతడి వ్యక్తిగత జీవితంలో తీరని విషాదం ఉందన్న విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు. అవును.. ధోని తన ఫస్ట్‌లవ్‌ను కోల్పోయాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి అకస్మాత్తుగా ఈ లోకాన్ని వీడటంతో అతడి కలల ప్రపంచం శూన్యమైంది. ఇంతకీ ధోని ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరు?
ఆమెతో జీవితం పంచుకోవాలనుకున్నాడు!
2002.. ధోని అప్పుడప్పుడే జాతీయ జట్టులోకి రావాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. అదే సమయంలో ప్రియాంక ఝా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. తనతోనే జీవితాన్ని పంచుకోవాలని కోరుకున్నాడు.
కానీ విధిరాత మరోలా ఉంది. దురదృష్టవశాత్తూ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రియాంక ఝా కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన నుంచి కోలుకునేందుకు ధోనికి చాలా సమయమే పట్టింది.
ధోని అనుమతి తీసుకున్న తర్వాతే
ఈ విషయాలను ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమాలో చూపించారు. ధోనిగా దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ప్రియాంక ఝా క్యారెక్టర్‌లో దిశా పటాని, ధోని సతీమణి సాక్షిగా కియారా అద్వానీ నటించారు. కాగా ధోని ఫస్ట్‌లవ్ గురించి సినిమాలో చూపించేందుకు దర్శకుడు నీరజ్ పాండే ముందుగానే అనుమతి తీసుకున్నాడు.
తొలుత ఇందుకు ధోని నిరాకరించినా తన జీవితంలోని సంఘటనలు ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో ఉన్న డైరెక్టర్ ప్రతిపాదనకు అంగీకరించాడట. అయితే, కొంతమంది మాత్రం ప్రియాంక .. ధోని చిన్ననాటి స్నేహితులు మాత్రమే అని చెప్పడం గమనార్హం. అదే విధంగా.. సినిమాలో ఈ విషయాలు చూపించారే తప్ప ధోని కూడా ఎప్పుడూ దీని గురించి మాట్లాడింది లేదు.
ధోని మూవీలో తన పాత్ర గురించి దిశా గతంలో మాట్లాడుతూ..
‘‘నిజ జీవిత పాత్రలతో ఈ సినిమా రూపొందించారు. మీరంతా కియారాలో సాక్షిని, సుశాంత్‌లో ధోనిని చూస్తారు. అయితే, ధోని మాత్రం నాలో ప్రియాంక చూస్తాడని అనుకున్నా’’ అని పేర్కొంది.
జింబాబ్వే, కెన్యా టూర్‌లో ఉన్న సమయంలో..
ఇక తన జీవితంలోని చేదు ఘటన సమయంలోనే ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇండియా- ‘ఏ’ జట్టుకు ఎంపిక అయ్యాడు. కెరీర్ గాడిన పడుతుందనుకుంటున్న సమయంలో పిడుగులాంటి వార్త ధోని ప్రేమసౌధాన్ని కూల్చివేసింది. 2003-04 జింబాబ్వే- కెన్యా పర్యటనలో ధోని వరుస సెంచరీలతో అదరగొట్టాడు.
కెన్యా, పాకిస్తాన్‌తో ట్రై సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లో 362 పరుగులతో సత్తా చాటాడు. తద్వారా నాటి టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ, తాత్కాలిక కోచ్ రవిశాస్త్రి దృష్టిని ఆకర్షించాడు. అలా 2004లో బంగ్లాదేశ్ టూర్ సందర్భంగా టీమిండియా వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.
సాక్షితో వివాహం
ఇక ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ టీమిండియా మేటి కెప్టెన్‌గా ఎదిగాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే.. ప్రియాంక తర్వాత సాక్షి సింగ్ రావత్ ధోని జీవితంలోకి వచ్చింది. 2010లో వీరి వివాహం జరిగింది. ఈ జంటకు కూతురు జీవా సంతానం. కాగా వచ్చే నెల(జూలై) 7న ధోని పుట్టినరోజు సందర్భంగా ధోని సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
చదవండి: జింబాబ్వే సంచలనం.. వన్డేల్లో అత్యధిక స్కోర్ నమోదు!
ఇంతటి విషాదమా! పాపం.. పిల్లల ముద్దూముచ్చట్లు చూడకుండానే.. మళ్లీ..
Comments
Please login to add a commentAdd a comment