ధోనీ ఎంత వసూలు చేశాడో తెలుసా | MS dhoni becomes highest grosser biopic in indian cinema | Sakshi
Sakshi News home page

ధోనీ ఎంత వసూలు చేశాడో తెలుసా

Oct 13 2016 9:40 AM | Updated on Sep 4 2017 5:05 PM

ధోనీ ఎంత వసూలు చేశాడో తెలుసా

ధోనీ ఎంత వసూలు చేశాడో తెలుసా

టీమిండియా మిస్టర్ కూల్ కెప్టెన్‌గా పేరొందిన మహేంద్రసింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'ఎంఎస్ ధోనీ - ద అన్‌టోల్డ్ స్టోరీ' సినిమా వసూళ్లలో దూసుకుపోతోంది.

టీమిండియా మిస్టర్ కూల్ కెప్టెన్‌గా పేరొందిన మహేంద్రసింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'ఎంఎస్ ధోనీ - ద అన్‌టోల్డ్ స్టోరీ' సినిమా వసూళ్లలో దూసుకుపోతోంది. ఇప్పటికే వంద కోట్లు దాటేసి, ఇప్పటివరకు దాదాపు రూ. 116 కోట్లు వసూలు చేసింది. ఇది కేవలం భారతీయ మార్కెట్లలో సాధించిన బిజినెస్ మాత్రమే. ఇప్పటివరకు జీవితచరిత్రల ఆధారంగా తీసిన సినిమాల్లో దేనికీ ఇంత పెద్దస్థాయిలో కలెక్షన్లు రాలేదు. నీరజ్ పాండే దర్శకత్వంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించిన ఈ సినిమా రాంచీ గల్లీల నుంచి టీమిండియా కెప్టెన్ వరకు ధోనీ ప్రయాణం ఎలా సాగిందన్న విషయాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.

భారతీయ సినిమాలలో ఇప్పటివరకు జీవిత చరిత్రల మీద తీసినవాటిలో ఇదే అతిపెద్ద గ్రాసర్ అని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సీఈఓ విజయ్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. ధోనీ పట్ల భారతీయులకు ఉన్న అభిమానం ఈ కలెక్షన్ల రూపంలోనే తెలుస్తోందని ఆయన అన్నారు. క్రికెట్ అభిమానులు, సినిమా అభిమానులు అందరికీ తాము కృతజ్ఞులమై ఉంటామన్నారు. కొత్తగా మిర్జియా, తుటక్ తుటక్ తుటియా లాంటి సినిమాలు విడుదలైనా కూడా.. ధోనీ సినిమా మరిన్ని షోలు వేయాలంటూ డిమాండు పెరుగుతోందని నిర్మాతలు తెలిపారు. సుశాంత్ సరసన కియారా అద్వానీ, దిశా పటానీ నటించిన ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement