ధోని బయోపిక్‌ సీక్వెల్‌..! | MS Dhoni Biopic Sequel | Sakshi
Sakshi News home page

ధోని బయోపిక్‌ సీక్వెల్‌..!

Published Wed, Jul 4 2018 3:31 PM | Last Updated on Wed, Jul 4 2018 3:37 PM

MS Dhoni Biopic Sequel - Sakshi

ధోని పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి.. విమర్శకుల ప్రశంసలు అందుకున్న సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌..

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు ఉత్సాహం కలిగించే వార్త ఒకటి బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'ఎంఎస్ ధోని - ద అన్‌టోల్డ్ స్టోరీ' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  త్వరలో ఎంఎస్‌ ధోని చిత్రానికి సీక్వెల్‌ రూపొందించనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి.  ధోని పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి.. ఫ్యాన్స్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, ఈ చిత్ర సీక్వెల్‌ కోసం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. 2011లో ప్రపంచకప్‌ విజయం తర్వాత ధోని జీవితంలోని ముఖ్య ఘట్టాలను సీక్వెల్‌లో చూపెట్టనున్నట్టు సమాచారం.

ధోని వ్యక్తిగత జీవితాన్ని కూడా తెరపై అవిష్కరించే విధంగా సీక్వెల్‌ను రూపొందించాలని సుశాంత్‌ భావిస్తున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. మొదటి పార్ట్‌ మాదిరిగానే ఇందులో కూడా ధోని జీవితంలోని వాస్తవాలను చూపించేలా స్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుందని వారు వెల్లడించారు. సీక్వెల్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ఇంకా ఖారారు కాలేదని పేర్కొన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ వచ్చేడాది ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. కాగా, 2016లో విడుదలైన ఎంఎస్‌ ధోని చిత్రానికి నీరజ్‌ పాండే దర్శకత్వం వహించగా, దిశా పటాని, కైరా అద్వానీ ఇతర ముఖ్య పాత్రలో నటించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement