రెండు వారాల్లో రూ. 200 కోట్లు క్రాస్‌ | padmaavat movie collections crossed 200 crores | Sakshi
Sakshi News home page

రెండు వారాల్లో రూ. 200 కోట్లు క్రాస్‌

Published Mon, Feb 5 2018 4:23 PM | Last Updated on Mon, Feb 5 2018 4:27 PM

padmaavat movie collections crossed 200 crores - Sakshi

పద్మావత్‌ సినిమాలోని దృశ్యాలు

సాక్షి, సినిమా : వివాదాల నడుమ విడుదలైన ‘పద్మావత్‌’ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీతో విజయవంతంగా దూసుకుపోతోంది. సినిమా విడుదలై మూడో వారంలోకి అడుగు పెట్టినా.. కలెక్షన్లు ఏ మాత్రం తగ్గడంలేదు. ఇప్పటికే ఈ సినిమా 200 కోట్లు దాటిపోయింది.  ‘పద్మావత్‌’ సినిమా ఇప్పటివరకు రూ. 212.5 కోట్లు వసూలు చేసిందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. 

మొదటి వారంలో రూ. 166.50 కోట్లు, రెండో వారంలో రూ. 46 కోట్లు వసూలు చేసి మొత్తం రూ.212.50 కోట్లు వసూలు చేసిందని పోస్ట్‌ చేశారు. సంజయ్‌ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే, షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌లు ప్రధాన పాత్రలు పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement