
బాహుబలి: ఇంకేమైనా రికార్డులు మిగిలాయా?
హిందీలోకి డబ్ అయిన ఒక తెలుగు సినిమా సృష్టిస్తున్న సంచలనం చూసి మార్కెట్ వర్గాలతో పాటు విమర్శకులు కూడా నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఇప్పటికే హిందీ వెర్షన్ ఒక్కదాంట్లోనే రూ. 300 కోట్లకు పైగా నెట్ వసూళ్లు చేసిన బాహుబలి-2 సినిమా, ఇప్పుడు రూ. 350 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ స్వయంగా ట్వీట్ చేశాడు. ఇప్పటికే బాహుబలి 2 సినిమా చాలా రికార్డులు బద్దలు కొట్టిందని ఆయన తెలిపారు.
ఫాస్టెస్ట్ 50 కోట్లు, ఫాస్టెస్ట్ 100 కోట్లు, ఫాస్టెస్ట్ 150 కోట్లు, ఫాస్టెస్ట్ 200 కోట్లు, ఫాస్టెస్ట్ 250 కోట్లు, ఫాస్టెస్ట్ 300 కోట్లు... వీటన్నింటినీ ఇప్పటికే దాటేసిందని, ఇప్పుడు రూ. 350 కోట్ల వైపు వెళ్తోందని చెప్పారు. ఈ సినిమా నిజంగా ఒక గేమ్‌ఛేంజర్ అని ఆయన ప్రశంసించారు. అయితే, ఉత్తరాదిలో మాత్రం కొందరు దక్షిణాది సినిమా ఇంతలా విజయం సాధించడం ఏంటన్న భావనలోనే ఉన్నట్లుంది. 'డియర్ బాహుబలి.. దంగల్ పని ఇంకా అయిపోలేదు, కలెక్షన్లు వస్తున్నాయి' అంటూ జాతీయ మీడియాలోని ఒక వర్గం వ్యాఖ్యానించింది. ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా బాహుబలి వసూళ్లను దాటి వెళ్తుందన్న ఉద్దేశంలో అలా రాశారు.
#Baahubali2 RECORDS: Fastest ₹ 50 cr... Fastest ₹ 100 cr... Fastest ₹ 150 cr... Fastest ₹ 200 cr... Fastest ₹ 250 cr... Fastest ₹ 300 cr...
— taran adarsh (@taran_adarsh) 9 May 2017
#Baahubali2 is now set to cross ₹ 350 cr, the FASTEST to achieve it. Seriously, is there any record left? This film is truly a GAME CHANGER!
— taran adarsh (@taran_adarsh) 9 May 2017