![Salman Khan Starrer Smoothly Enters Rs Hundred Cr Club - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/18/race-3.jpg.webp?itok=LE38cdOM)
రూ వంద కోట్ల క్లబ్‌లో రేస్ 3
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన రేస్ 3 విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన పొందినా కలెక్షన్లపరంగా దూసుకుపోతోంది. రేస్ 3 రూ వంద కోట్ల క్లబ్‌లో అవలీలగా చోటు దక్కించుకుంది. ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిన సల్మాన్ నాలుగో సినిమాగా నమోదైందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
ఇప్పటివరకూ సల్మాన్ నటించిన భజరంగిభాయ్‌జాన్, సుల్తాన్, టైగర్ జిందాహై మూడు రోజుల్లో వంద కోట్ల వసూళ్ల మార్క్‌ను అధిగమించాయి. ఇక రేస్ 3 శుక్రవారం రూ 29.17 కోట్లు, శనివారం 38.14 కోట్లు, ఆదివారం రూ 39.14 కోట్లు కలెక్ట్ చేసిందని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
రేస్ 3లో సల్మాన్‌తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, డైసీ షా, బాబీ డియోల్, సాఖిబ్ సలీం, అనిల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రేస్ ఫ్రాంచైజ్‌లో గతంలో సైఫ్ అలీఖాన్ నటించగా, రేస్ 3లో బాలీవుడ్ కండలవీరుడు ఎంటరయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment