
ప్రముఖ సర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌పై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వరస్ట్ బాలీవుడ్ యాక్టర్, వరస్ట్ ఇండియన్ యాక్టర్ అని గూగుల్‌లో వెతకగా సల్మాన్ ఖాన్ ఫొటోతో పాటు అతడి వివరాలు రావడంతో ఫ్యాన్స్ కంగుతిన్నారు. తమ అభిమాన నటుడ్ని వరస్ట్ యాక్టర్‌గా చూపించటం జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు యాంటీ ఫ్యాన్స్ కొందరు రేస్-3 లో సల్మాన్ నటన చూశాక గూగుల్ ఇలా చేసి ఉంటుందంటూ సెటైర్లు వేస్తున్నారు.
అయితే భారతీయ ప్రముఖుల గురించి గూగుల్ నెటిజన్లకు షాక్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. రెండు నెలల క్రితం భారత దేశ తొలి ప్రధాని ఎవరు అన్న సమాధానానికి నెహ్రూకి సంబంధించిన సమాచారం రాగా.. ఫొటో మాత్రం నరేంద్ర మోదీది ప్రత్యక్షం కావటంతో చాలా మంది కంగుతున్నారు. ఈ విషయం కాస్తా వైరల్ కావటం.. అదే సమయంలో విమర్శలకు దారితీయటం జరిగింది. దీంతో పొరపాటును గమనించిన గూగుల్.. ఆ తప్పిదాన్ని సరిచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment