ఎన్టీఆర్ తాజా సినిమా ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్క్ ను దాటేసింది. కొరటాల శివ దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించింది. కబాలి(రూ.87.5 కోట్లు), బాహుబలి(రూ.73 కోట్లు) తర్వాత అత్యధిక ఓపెన్సింగ్ వసూళ్లు సాధించిన సినిమాగా నిలియింది.