'అజ్ఞాతవాసి'ని ఇంకా ఏమంటారు : తరణ్ ఆదర్శ్ | Call it Agnyaathavaasi as a STORM Says taran adarsh | Sakshi
Sakshi News home page

'అజ్ఞాతవాసి'ని ఇంకా ఏమంటారు : తరణ్ ఆదర్శ్

Published Thu, Jan 11 2018 11:43 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Call it Agnyaathavaasi as a STORM Says taran adarsh - Sakshi

సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన అజ్ఞాతవాసి, ఓవర్ సీస్ లో మాత్రం భారీగా ఓపెనింగ్స్ వచ్చాయని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. అమెరికాలో హాలీవుడ్ దిగ్గజ చిత్రాలతో పోటీపడి తెలుగు సినిమా టాప్ స్థానంలో నిలిచిందని, తొలిరోజు కలెక్షన్లపై తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. 'అజ్ఞాతవాసి సినిమా అమెరికాలో భారీ వసూళ్లతో మొదలయింది. వీకెండ్ మధ్యలో విడుదలైనా కానీ.. ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల(9 కోట్ల 65 లక్షల రూపాయలు)కు పైగానే కలెక్ట్ చేసింది.. ఈ కనెక్షన్లను తుఫాన్ అనాలా..?, సునామీ అనాలా..? టైఫూన్ అనాలా..?. అమెరికాలో కేవలం ప్రీమియర్ల ద్వారానే 1.5మిలియన్ డాలర్లను అజ్ఞాతవాసి సినిమా దాటేసింది. వర్కింగ్ డే అయినా కూడా.. ఈ రేంజ్ కలెక్షన్లను సాధించిన ఈ చిత్రాన్ని అద్భుతం కాకుండా ఇంకా ఏమంటారు?’ అని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement