అక్కడ దుమ్మురేపుతున్న 'జనతా గ్యారేజ్'! | Janatha Garage takes a SENSATIONAL start in USA | Sakshi
Sakshi News home page

అక్కడ దుమ్మురేపుతున్న 'జనతా గ్యారేజ్'!

Published Thu, Sep 1 2016 6:09 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

అక్కడ దుమ్మురేపుతున్న 'జనతా గ్యారేజ్'!

అక్కడ దుమ్మురేపుతున్న 'జనతా గ్యారేజ్'!

భారీ అంచనాల నడుమ విడుదలైన జూనియర్‌ ఎన్టీఆర్‌ తాజా సినిమా 'జనతా గ్యారేజ్‌' ప్రస్తుతం థియేటర్లలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా.. తొలిరోజు కలెక్షన్లు భారీగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు, కేరళతో పాటు ప్రపంచవ్యాప్తంగా రెండు వేలకు పైగా థియేటర్లలో 'జనతా గ్యారేజ్‌' ప్రేక్షకుల ముందుకువచ్చింది.

ఈ సినిమా అమెరికాలో దుమ్మురేపుతోంది. వారం మధ్యలో (బుధవారం) విడుదలైనా జనతా గ్యారేజ్‌ అగ్రరాజ్యంలో అద్భుతంగా ఆడుతోందని, హిందీ పెద్ద సినిమాలను తలదన్నేలా ఈ సినిమాకు కలెక్షన్లు ఉన్నాయని బాలీవుడ్‌ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్ ట్విట్టర్‌లో తెలిపారు. అమెరికాలో ఈ సినిమా సెన్సేషనల్‌ ప్రారంభ వసూళ్లను సాధిస్తున్నదని, ప్రస్తుతం అందుతున్న సమాచారం బట్టి మొదటి రోజు కలెక్షన్లు రూ. 3.76 కోట్లు వచ్చినట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement