బాహుబలికి దగ్గరగా వచ్చేస్తున్నాడు!
బాలీవుడ్ బాక్సాఫీసును సల్మాన్ షేక్ చేస్తున్నాడు. ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ కలెక్షన్ల సునామీ ఎలా సృష్టించాడో.. ఇప్పుడు అలాగే 50 ఏళ్ల వయసులో మల్లయోధుడి పాత్రలో జీవించిన సల్మాన్.. వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. సుల్తాన్ సినిమా విడుదలైన మొదటి ఐదు రోజుల్లోనే రూ. 200 కోట్ల కలెక్షన్లకు దగ్గరగా వచ్చేశాడు. అయితే... ఆలిండియా కలెక్షన్లలో ఆల్టైం రికార్డులు తిరగరాసిన బాహుబలిని మాత్రం ఇప్పటికి ఇంకా దాటలేకపోయాడు. మొదటి ఐదు రోజుల్లో బాహుబలి గ్రాస్ 320 కోట్ల రూపాయలు కాగా, నెట్ వసూళ్లు రూ. 260 కోట్లు. ఇప్పుడు సల్మాన్ మొదటి ఐదు రోజుల్లో తన సుల్తాన్ సినిమాకు రూ. 200 కోట్ల వసూళ్లకు దగ్గరైనట్లు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.
సర్వసాధారణంగా ఉన్న ఓ కథకు తనదైన శైలిలో మాస్ మసాలా జోడించడం ద్వారా సల్మాన్ ఈ మ్యాజిక్ చేశాడని బాలీవుడ్ పండితులు అంటున్నారు. ఫ్యాన్లు తనను ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలాగే చేయడంతో పాటు.. సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా తగినంత ప్రాధాన్యం కల్పించడం ప్రేక్షకులకు నచ్చిన అంశం. మొదటి ఐదు రోజుల్లో సుల్తాన్ సాధించిన వసూళ్లు ఇప్పటివరకు అతడి కెరీర్లో ఏ సినిమాకూ రాలేదట. ప్రస్తుతం దేశమంతా ‘సల్మానియా’ (సల్మాన్ మానియా) అలముకుందని తరణ్ ఆదర్శ్ అంటున్నాడు.
సల్మాన్కు ఇప్పటివరకు రెండు సినిమాలు మాత్రమే రూ. 200 కోట్ల క్లబ్బులో చేరాయి. ఒకటి ప్రేమ్ రతన్ ధన్ పాయో, మరొకటి కిక్. ఇక బజరంగీ భాయీజాన్ అయితే రూ. 300 కోట్లు వసూలు చేసింది. సుల్తాన్ ఇప్పటికే రూ. 200 కోట్లకు రావడంతో.. ఇక రూ. 300 కోట్లు సాధించడం కూడా కష్టం కాకపోవచ్చని అంటున్నారు.
What's REMARKABLE is that #Sultan has crossed *lifetime biz* of several biggies in just 5 days... All set for ₹ 200 cr... WOW!
— taran adarsh (@taran_adarsh) 11 July 2016
#Sultan creates HISTORY... Had an UNPRECEDENTED 5-day weekend... Raises the bar for Hindi film biz... It's a MONSTROUS HIT!
— taran adarsh (@taran_adarsh) 11 July 2016