సునీల్ దత్‌గా...! | Amitabh Bachchan to play Sunil Dutt in Sanjay Dutt's biopic | Sakshi
Sakshi News home page

సునీల్ దత్‌గా...!

Published Sat, Jan 24 2015 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

సునీల్ దత్‌గా...!

సునీల్ దత్‌గా...!

ఏడు పదుల వయసులో ఏడాదికి రెండు, మూడు సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, టీవీ షోస్ చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు అమితాబ్ బచ్చన్. ఆయన నటించిన తాజా చిత్రాలు షమితాబ్, పీకు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమితాబ్ మరో చిత్రానికి పచ్చజెండా ఊపారని సమాచారం. అది కూడా ఓ నిజజీవిత పాత్రనే ఈ బిగ్ బి చేయనుండటం విశేషం. ఆ విషయంలోకి వస్తే... 3 ఇడియట్స్, పీకే తదితర చిత్రాలతో విలక్షణ దర్శకుడనిపించుకున్న రాజ్‌కుమార్ హిరానీ, త్వరలో నటుడు సంజయ్ దత్ జీవిత చరిత్రతో ఓ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రను అమితాబ్‌తో చేయించాలనుకుంటున్నారట. ఇటీవల అమితాబ్‌తో సంప్రతింపులు జరిపారని భోగట్టా. సంజయ్ దత్ పాత్రను రణబీర్ కపూర్ చేయనున్నారని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement