బాలీవుడ్‌లో మరో బయోపిక్ వచ్చేస్తోంది. సీనియర్ నటుడు సంజయ్ దత్ జీవితగాథను సంజు పేరుతో దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ(మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే ఫేమ్) తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు టీజర్‌లు కాసేపటి క్రితం విడుదల అయ్యాయి. యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ లీడ్ రోల్ చేస్తుండగా.. అనుష్క, సోనమ్ కపూర్, మనీషా కోయిరాల, పరేష్ రావెల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.