Shah Rukh Khan Announces New Movie Dunki With Rajkumar Hirani - Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: ఆ స్టార్‌ డైరెక్టర్‌తో జతకట్టిన షారుక్‌, ఆసక్తిగా మూవీ టైటిల్‌

Published Tue, Apr 19 2022 5:54 PM | Last Updated on Tue, Apr 19 2022 6:32 PM

Shah Rukh Khan Announces New Movie Dunki With Rajkumar Hirani - Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ తన ఫ్యాన్స్‌ సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చాడు. మూడేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న షారుక్‌ ప్రస్తుతం వరస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. తాజాగా ఆయన మరో సినిమాకు సంతకం చేశాడు. తన తదుపరి సినిమా కోసం పీకే, మున్నా భాయ్‌ ఎంబీబీఎస్‌ చిత్రాల దర్శకుడు రాజ్‌కుమార్‌ హీరానీతో తొలిసారి జతకట్టాడు. ఈ విషయాన్ని స్వయంగా షారుక్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ హీరానితో కలిసి ఓ ఆసక్తికర వీడియోను పంచుకుంటూ మూవీ టైటిల్‌ను కూడా రివీల్‌ చేశాడు. ఈ వీడియోలో షారుక్‌ మున్నా భాయ్‌ ఎంబీబీఎస్‌, పీకే చిత్రాల పోస్టర్ల ఎదురుగా నిలబడి కనిపిస్తాడు. 

చదవండి: ‘ఆచార్య’ రీషూట్‌పై స్పందించిన డైరెక్టర్‌ కొరటాల

ఆ తర్వాత రాజ్‌కుమార్‌ హీరానీతో తన కోసం కూడా ఏదైనా కథ ఉందా అని అడగ్గా అవును..ఉందని సమాధానం ఇస్తాడు. దీనికి టైటిల్‌ ఏంటని అడగ్గా డంకీ అంటూ టైటిల్‌ చెప్పేశాడు డైరెక్టర్‌. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య సాగే సంభాషణ ఫన్నీగా ఉంటుంది. ఇక ఈ పోస్ట్‌ను షారుక్‌ షేర్‌ చేస్తూ.. ‘డియర్‌ రాజ్‌కుమార్‌ సర్‌, మీరు నాకోసం సాంటా క్లాజ్‌ని వదిలారు. మీరు మొదలు పెట్టండి నేను వచ్చేస్తున్నా. చెప్పాలంటే ఇప్పటికే నేను సెట్‌లో ఉండాల్సింది. అయితే చివరకు మీతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ రాసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో షారుక్‌ మూవీ టైటిల్‌ ‘డంకీ’ అని, 2023 డిసెంబర్‌ 22న ఈ సినిమాను థియేటర్లోకి తీసుకురానున్నట్లు పోస్ట్‌లో పేర్కొన్నాడు. కాగా ఈ మూవీలో కథానాయికగా తాప్పీ పన్ను నటిస్తున్నట్లు సమాచారం.

చదవండి: భారీ ఆఫర్‌ను తిరస్కరించిన అల్లు అర్జున్‌!, ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement