
సినిమాటోగ్రాఫర్ అమిత్ రాయ్, రాజ్‌కుమార్ హీరాని, షారుక్ ఖాన్
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ దాదాపు మూడేళ్ల గ్యాప్ అనంతరం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో వస్తున్నాడు. ప్రస్తుతం షారుక్ చేతి మూడు నుంచి నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో డైరెక్టర్ రాజ్‌కుమార్ హీరాని ‘డంకీ’ ఒకటి. తాప్సీ పన్ను హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అమిత్ రాయ్ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. సెట్స్‌పైకి వచ్చి తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
చదవండి: అతియా, కేఎల్ రాహుల్ పెళ్లి డేట్‌పై క్లారిటీ ఇచ్చిన సునీల్ శెట్టి
డంకీకి సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన అమిత్ రాయ్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై క్లారిటీ లేదు. తాజాగా ఈ వార్తలపై అమిత్ రాయ్ స్పందించాడు. ఇటీవల ముంబై మీడియాతో ముచ్చటించిన ఆయన ఇకపై తాను డంకీ మూవీకి పనిచేయడం లేదని స్పష్టం చేశాడు. ‘తొలి షెడ్యూల్‌లో భాగంగా డంకీ చిత్రానికి 18, 19 రోజులు వర్క్ చేశాను. ఇకపై నేను ఆ సినిమాకీ పని చేయడం లేదు. నాకు, డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానికి మధ్య అనుకొని మనస్పర్థలు తలెత్తడమే ఇందుకు కారణం’ అని చెప్పుకొచ్చాడు.
చదవండి: పెళ్లి అనంతరం అదే జోరు.. 75వ చిత్రానికి రెడీ అయిన నయన్
అనంతరం ఆయన మనస్పర్థలపై వివరణ ఇస్తూ.. ‘ఇద్దరి ఆలోచనలు ఏకీభవించడం లేదు. మేం ఒకే కోణంలో చూడలేకపోయాం. ఈ క్రమంలో మా మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయి. ఇది భవిష్యత్తులో ఎలాంటి గొడవలకు దారి తీయకూడదనే ఉద్దేశంతోనే ఈ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. ఇదే విషయాన్ని డైరెక్టర్‌తో కూర్చొని మాట్లాడాను కూడా. ఇక పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయానికి వచ్చాం’ అని అన్నాడు. అయితే తాను తీసిన షాట్స్ మాత్రం అలాగే ఉంటాయని అమిత్ రాయ్ తెలిపాడు. కాగా ఈ సినిమాను 2023 డిసెంబర్ 22న థియేటర్లోకి తీసుకురానున్నట్లు మూవీ యూనిట్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment