Amit Roy
-
డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్‌కి మధ్య మనస్పర్థలు,నిలిచిపోయిన షారుక్ మూవీ!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దాదాపు మూడేళ్ల గ్యాప్ అనంతరం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో వస్తున్నాడు. ప్రస్తుతం షారుక్ చేతి మూడు నుంచి నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో డైరెక్టర్ రాజ్‌కుమార్ హీరాని ‘డంకీ’ ఒకటి. తాప్సీ పన్ను హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అమిత్ రాయ్ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. సెట్స్‌పైకి వచ్చి తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. చదవండి: అతియా, కేఎల్ రాహుల్ పెళ్లి డేట్‌పై క్లారిటీ ఇచ్చిన సునీల్ శెట్టి డంకీకి సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన అమిత్ రాయ్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై క్లారిటీ లేదు. తాజాగా ఈ వార్తలపై అమిత్ రాయ్ స్పందించాడు. ఇటీవల ముంబై మీడియాతో ముచ్చటించిన ఆయన ఇకపై తాను డంకీ మూవీకి పనిచేయడం లేదని స్పష్టం చేశాడు. ‘తొలి షెడ్యూల్లో భాగంగా డంకీ చిత్రానికి 18, 19 రోజులు వర్క్ చేశాను. ఇకపై నేను ఆ సినిమాకీ పని చేయడం లేదు. నాకు, డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానికి మధ్య అనుకొని మనస్పర్థలు తలెత్తడమే ఇందుకు కారణం’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: పెళ్లి అనంతరం అదే జోరు.. 75వ చిత్రానికి రెడీ అయిన నయన్ అనంతరం ఆయన మనస్పర్థలపై వివరణ ఇస్తూ.. ‘ఇద్దరి ఆలోచనలు ఏకీభవించడం లేదు. మేం ఒకే కోణంలో చూడలేకపోయాం. ఈ క్రమంలో మా మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయి. ఇది భవిష్యత్తులో ఎలాంటి గొడవలకు దారి తీయకూడదనే ఉద్దేశంతోనే ఈ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. ఇదే విషయాన్ని డైరెక్టర్‌తో కూర్చొని మాట్లాడాను కూడా. ఇక పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయానికి వచ్చాం’ అని అన్నాడు. అయితే తాను తీసిన షాట్స్ మాత్రం అలాగే ఉంటాయని అమిత్ రాయ్ తెలిపాడు. కాగా ఈ సినిమాను 2023 డిసెంబర్ 22న థియేటర్లోకి తీసుకురానున్నట్లు మూవీ యూనిట్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఈసారి తక్కువ మాట్లాడతా!
‘‘ముంబయ్‌లో అడుగుపెట్టిన వేళా విశేషం బాగుందో ఏమో.. అక్కడికి అలా వెళ్లానో లేదో ఇలా ఓ సినిమాకు సంతకం చేసేశాను. పైగా, ఇప్పటివరకు నేను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రను ఈ సినిమాలో చేస్తున్నాను’’ అన్నారు తాప్సీ. ‘చష్మే బద్దూర్’ చిత్రం ద్వారా హిందీ రంగానికి పరిచయమైన ఈ ఢిల్లీ బ్యూటీ ప్రస్తుతం అక్కడ ‘రన్నింగ్ షాదీ డాట్‌కామ్’ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇక, ముంబయ్‌కి మకాం మారగానే ఆమె అంగీకరించిన చిత్రం పేరు ‘బేబీ’. అక్షయ్‌కుమార్ హీరోగా నీరజ్ పాండే దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో పోషిస్తున్న పాత్ర గురించి తాప్సీ చెబుతూ - ‘‘హిందీలో మొదటి సినిమా ‘చష్మే బద్దూర్’లో నేను చురుకైన అమ్మాయిలా నటించాను. రెండో సినిమా ‘రన్నింగ్ షాదీ డాట్‌కామ్’లో కూడా దాదాపు నా పాత్ర అలానే ఉంటుంది. ఈ రెండు పాత్రలకు భిన్నమైన పాత్రను ‘బేబీ’లో చేస్తున్నా. ఈ సినిమాలో నా పాత్ర తక్కువ మాట్లాడుతుంది. అలాగే ఎప్పుడూ సీరియస్‌గా కనిపిస్తుంది నా శారీరక భాష, హిందీ భాష ఉచ్చారణ అన్నీ విభిన్నంగా ఉంటాయి. ‘బేబీ’ చిత్రం షూటింగ్లో పాల్గొన్న మర్నాడు ‘రన్నింగ్ షాదీ డాట్‌కామ్’ షూటింగ్లో పాల్గొంటే, ఆ చిత్రదర్శకుడు అమిత్ రాయ్ తెగ కంగారుపడిపోయేవారు. ఎందుకంటే, ఆ షూటింగ్ లొకేషన్లో కూడా ‘బేబీ’కి మాట్లాడిన యాసలోనే మాట్లాడేదాన్ని. షూటింగ్ విరామంలో సీరియస్‌గా కూర్చునేదాన్ని. దాంతో అమిత్ ‘నువ్వు ఉన్నది రన్నింగ్ షాదీ డాట్‌కామ్’ షూటింగ్’లో అనేవారు. అప్పుడు ఈ సినిమా పాత్రకు తగ్గట్టుగా మారేదాన్ని. ‘బేబీ’ పాత్ర అంతగా నన్ను ప్రభావితం చేసింది. ‘రన్నింగ్...’లో కూడా నా పాత్ర చాలా బాగుంటుంది. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ‘చష్మే బద్దూర్’ తెచ్చిన పేరుని ఈ చిత్రం రెట్టింపు చేస్తే, దీని ద్వారా వచ్చిన పేరు ‘బేబీ’తో రెట్టింపు అవుతుంది’’ అని చెప్పారు.