అన్న సినిమా సూపర్ గా ఉంటుంది! | Sanjay dutt biopic will be interesting, says sister Priya Dutt | Sakshi
Sakshi News home page

అన్న సినిమా సూపర్ గా ఉంటుంది!

Published Sun, Feb 28 2016 12:56 PM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

అన్న సినిమా సూపర్ గా ఉంటుంది!

అన్న సినిమా సూపర్ గా ఉంటుంది!

ముంబై: బాలీవుడ్ మున్నాభాయ్‌ సంజయ్‌ దత్‌. మొన్ననే ఎరవాడ జైలు నుంచి విడుదలైన సంజూ భాయ్‌ జీవితకథ ఆధారంగా త్వరలోనే సినిమా రానుంది. రణ్‌బీర్ కపూర్‌ సంజూగా నటించే ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రాజ్‌కుమార్ హిరానీ వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ 'ఖల్‌నాయక్‌' ముద్రపడిన సంజూభాయ్‌ జీవితం నిండా వివాదాలే. హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు, డ్రగ్స్‌కు బానిస కావడం, అండర్‌ వరల్డ్ మాఫియాతో సంబంధాలు, అక్రమ ఆయుధాలు, జైలు జీవితం.. వై-ఫైలా వివాదాలు చుట్టుముట్టిన ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కే సినిమాపై సంజయ్ దత్ సోదరి ప్రియా దత్‌ తాజాగా స్పదించింది. 

అన్న సినిమా ప్రేక్షకులకు చాలా ఆసక్తిగా ఉంటుందని, ఎంతగానో నచ్చుతుందని ఆమె పేర్కొంది. 'ఆయన జీవితం చాలా ఆసక్తికరం. ఈ బయోపిక్‌లో ఏం చూపిస్తారో, ఎలా చూపిస్తారో అన్నది నాకు తెలియదు. కానీ ఇంతటి సంఘర్షణను ఎదుర్కొని కూడా శాంతంగా, బలంగా కనిపించే వ్యక్తులు చాలా అరుదు. కాబట్టి ఈ జీవిత కథ తప్పకుండా ఆసక్తికరంగా ఉంటుంది' అని ప్రియాదత్ తెలిపింది. తన కెరీర్‌లో సంజూభాయ్‌ ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసినప్పటికీ.. 'మున్నాభాయ్‌' సిరీస్ చిత్రాలు, 'వాస్తవ్' సినిమా తనకెంతో ఇష్టమని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement