మున్నాభాయ్-3కి... స్క్రిప్ట్ దొరికింది! | Munnabhai script was found to -3! | Sakshi
Sakshi News home page

మున్నాభాయ్-3కి... స్క్రిప్ట్ దొరికింది!

Published Sat, Oct 31 2015 10:40 PM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM

మున్నాభాయ్-3కి... స్క్రిప్ట్ దొరికింది!

మున్నాభాయ్-3కి... స్క్రిప్ట్ దొరికింది!

బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ కెరీర్‌ను మలుపు తిప్పిన  ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ సంచలనం. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రకథ తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో రీమేకై, ఘన విజయం సాధిం చింది. తెలుగులో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’గా చిరంజీవి చేసిన సందడి ఎవరూ మర్చిపోలేరు. సెకండ్ పార్ట్ ‘లగేరహో మున్నాభాయ్’ కూడా హిందీ నుంచి ఇతర భాష ల్లోకి వెళ్ళింది. మున్నాభాయ్ మూడోపార్ట్ తీస్తానని ఎప్పటి నుంచో ఊరిస్తున్న రాజ్‌కుమార్ హిరానీ ఇప్పుడు ఆ సినిమాకు స్క్రిప్ట్ ఐడియా కొలిక్కివచ్చిందని వెల్లడించారు.

సంజయ్‌దత్ జీవితచరిత్ర ఆధారంగా తీయాలనుకుంటున్న సినిమాకు స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే, మున్నాభాయ్- 3కి కూడా కసరత్తులు చేస్తున్నారాయన. ‘‘పార్ట్3కి మంచి ఐడియా తట్టింది. ఈ స్క్రిప్ట్‌ను తయారు చేస్తున్నాం. ఇందులో సంజయ్‌దత్, అర్షద్‌వార్శీలే ప్రధాన పాత్రలు పోషిస్తారు. అయితే వాళ్లను దృష్టిలో పెట్టుకుని కథ రాయడం లేదు. ఎందుకంటే స్టార్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కథ రాస్తే అంత స్వేచ్ఛగా ఆలోచనలు రావని నా అభిప్రాయం’’ అని రాజ్‌కుమార్ స్పష్టం చేశారు. సో... బీ రెడీ ఫర్ ‘మున్నాభాయ్-3’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement