
ఏ క్యాహై భాయ్?
‘బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేస్తూ దేశం పరువు తీయొద్దు’ అంటూ ప్రచారమాధ్యమాల్లో ఊదరగొడుతున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ తన స్నేహితుడు హీరో సల్మాన్‌ఖాన్‌తో కలసి ఏం చేస్తున్నాడో చూడండి...‘ఇంక్రెడిబుల్‌ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్‌గా తాను చెప్పిన దానికి విరుద్ధంగా చేస్తూ ఇలా ఫొటోలకు పోజిచ్చాడు. అంతేకాదు ఈ ఫొటోను ట్విట్టర్‌లో పెట్టి...‘ ఇద్దరు మిత్రులు ఒకే మొక్కపై ‘నీళ్లు’పోస్తే స్నేహం మరింత బలపడుతుంది’అంటూ కామెంట్ కూడా పెట్టాడు. దీనిపై సోషల్‌మీడియాలో పెద్దయెత్తున విమర్శలు వస్తున్నాయి. సల్మాన్‌ఖాన్ కొత్త చిత్రం ‘జయహో’ ప్రమోషన్‌కోసం అమీర్ ఇలా చేస్తున్నాడని కొందరు... దేశం పరువుతీశాడని మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు.