సల్మాన్‌ తీక్షణంగా ఏదో ఆలోచిస్తున్నాడు... | Poster Of Salman Khan Race 3 Is Revealed | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ తీక్షణంగా ఏదో ఆలోచిస్తున్నాడు...

Published Sun, Apr 1 2018 8:00 PM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Poster Of Salman Khan Race 3 Is Revealed - Sakshi

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ ప్రస్తుతం ‘రేస్‌3’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో సల్మాన్‌కు జోడిగా శ్రీలంక భామ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ నటిస్తోంది. చిత్ర యూనిట్‌ దుబాయ్‌లో షూటింగ్‌ చేస్తోంది. హీరో, హీరోయిన్లపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అయితే సల్మాన్‌కు సంబంధించిన ఫోటో జాక్వెలిన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. 

ఈ ఫోటోలో సల్మాన్‌ ఏదో ఆలోచిస్తున్నట్లుగా అద్దాల్లోంచి బయటకు చూస్తున్నాడు. దాంతో పాటే తన బాడీని కూడా ఎక్స్‌పోజ్‌ చేస్తున్నాడు. ఈ ఫోటోను జాక్వెలిన్‌ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేసింది. రెమో డిసౌజా దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌ ప్రొడక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా జూన్‌ 15న విడుదలయ్యే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement